జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. టీడీపీల డీఎన్‌ఏనే బీసీ.. బీసీల గుండెల్లో ఉండేదే టీడీపీ. కాపీ క్యాట్ వచ్చి రాజకీయాలు చేస్తే.. ప్రజలు నమ్మరు.బీసీలకు జగన్ చేసింది సున్నా.. ఇచ్చిన హామీలు సున్నా.. మరి జయహో బీసీ ఎందుకో అర్థం కావడం లేదు.ప్యాలెస్ పిల్లి కాపీ క్యాట్.. బీసీ సదస్సుకు మేం పెట్టిన పేరే పెట్టారు.మేం అప్పట్లో జయహో బీసీ సదస్సు కోసం పాట తయారు చేశాం.. కావాలంటే ఆ పాట కూడా పంపుతాం.. వాడుకోండి.జగన్ వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 8 శాతం కోత పెట్టారు.దాదాపు 26 ఏళ్ల పాటు.. బీసీలు 34 శాతం రిజర్వేషన్లు అనుభవిస్తే.. జగన్ వచ్చి దాన్ని 26 శాతానికి తగ్గించారు.
బీసీ కార్పోరేషన్ ద్వారా టీడీపీ రూ. 6 వేల కోట్లు ఖర్చు పెడితే.. వైసీపీ ఖర్చు పెట్టింది సున్నా.బీసీ సబ్ ప్లాన్ తెచ్చిందే టీడీపీ.. చంద్రబాబు అన్నారు లోకేష్. బీసీ సబ్ ప్లాన్ ద్వారా రూ. 34 వేల కోట్లు కేటాయిస్తే.. రూ. 30 వేల కోట్లు ఖర్చు పెట్టాం. బీసీ సబ్ ప్లాన్ వైసీపీ కోసం ఖర్చు పెట్టింది సున్నా. ఆదరణ పథకం ద్వారా రూ. వేయి కోట్లు ఖర్చు పెడితే.. వైసీపీ ఖర్చు పెట్టింది సున్నా. సజ్జల, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలకు బీసీలంటే నరనరాన ద్వేషం.. కోపం. పుంగనూరులో బీసీ కులానికి చెందిన రామచంద్రయాదవ్ అనే జనసేన నేత పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా పోరాడినందుకు ఇంటి మీద దాడి చేశారు. రామచంద్రయాదవ్ ఇంటిపైన.. కారు పైన దాడి చేశారు.
రామచంద్రయాదవ్ ఇంటి మీదకు 350 మందిని దాడికి పంపారు.సొంత సామాజిక వర్గమైన రెడ్ల మీద పెద్దిరెడ్డి ఎందుకు దాడి చేయలేదు..?బీసీ కాబట్టే.. రామచంద్రయాదవ్‌పై దాడి చేశారు.జగన్ సీఎం అయ్యాక.. 34 మంది బీసీ నేతలను చంపేశారు.. ఇదేనా వైసీపీ జయహో బీసీ నినాదం.సలహాదారులంతా ఒకే సామాజిక వర్గానికి ఇస్తున్నారు.మిగిలిన కులాల్లో మేథావుల్లేరా..?60 కార్పోరేషన్ల ఏర్పాటు చేశామన్నారు.. కానీ కార్పోరేషన్ల ఛైర్మన్‌లకు కూర్చొనేందుకు కుర్చీలే లేవు.వీసీల నియామకంలో చంద్రబాబు 16కు గానూ.. 9 మంది బీసీలకే ఇచ్చారు.. జగన్ 16కు గానూ 13 రెడ్లకే ఇచ్చారు.అందరికీ ఇచ్చిన పథకాల్లో బీసీలకు ఎంతిచ్చారో లెక్కలేస్తారు.. ఇది వైసీపీ విధానం అని విమర్శించారు లోకేష్.
Read Also:Saudi Prince:హత్య కేసులో సౌదీ యువరాజుకు ఊరట.. కేసును కొట్టేసిన యూఎస్ కోర్టు
జగన్ బటన్ నొక్కారు.. కరెంట్ ఛార్జీలు పెరిగాయి. జగన్ బటన్ నొక్కారు.. చెత్త పన్ను వేశారు.జగన్ బటన్ నొక్కారు.. పెట్రో డిజీల్ ధరలు పెరిగాయి.జగన్ బటన్ నొక్కారు.. ఎస్సీ, బీసీలకు చెందిన చాలా పథకాలు గోవిందా గోవిందా..జగన్ ఓ బటన్ రెడ్డి… అలా బటన్ నొక్కుతూ కూర్చొంటారు.అమర్‌రాజాను తెలంగాణకు పంపేశారు.. అదేంటంటే పొల్యూషన్ అంటారు.రామ్ ఏమన్నా పిచ్చొడా పొల్యూషన్ ఉన్న కంపెనీని తీసుకోవడానికి..?ఏపీ పరిశ్రమలు తీసుకెళ్లండని తెలంగాణతో ఏమన్నా రహస్య ఒప్పందం చేసుకున్నారా..? జాకీ కంపెనీని చిన్న చితకా కంపెనీ అంటారు.. వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసే కంపెనీ చిన్నదా..?అమరావతిలో కౌలు రైతులకు.. అసైన్డ్ రైతులకు ప్రభుత్వం కౌలు చెల్లించడం లేదు.రహస్య జీవోల ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పీకేస్తున్నారు.నేను ఉన్నాను.. నేను విన్నాను.. నేను రెగ్యులరైజ్ చేస్తామన్నారు.. ఇప్పుడు వారి ఉద్యోగాలు పీకేశారు.ప్రజల్లో చైతన్యం తెచ్చే లక్ష్యంతో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నా.. త్వరలో వివరాలు వెల్లడిస్తా.ప్రజలు ఐదేళ్లు పాలించమని ప్రజలు ఓటేశారు.. ముందస్తు ఎన్నికలు పెట్టాలంటే మిగిలిన కాలానికి చెల్లించాల్సిన పథకాల మొత్తాలు ప్రజలకు చెల్లించి ముందస్తుకు వెళ్లాలన్నారు లోకేష్.
ప్రజల్లో తిరుగుతుంటే సంక్షేమానికి జగన్ సర్కార్ భారీ ఎత్తున కోతలు విధించిందని స్పష్టమవుతోంది.ధరలు పెరిగాయి.. కరెంట్ ఛార్జీలు పెంచేశారు.పెట్రో, డిజీల్ ధరలు పెంచేశారు.సీఎం జగన్ బయటకొచ్చి ఏదేదో మాట్లాడతారు.. తాడేపల్లి ప్యాలెస్‌లోకి వెళ్లి మ్యావ్ మ్యావ్ అంటారు.జగన్ సహా వైసీపీ నేతలు చాలా ఆరోపణలు చేశారు.మూడున్నరేళ్లకు పైగా కాలం గడుస్తున్నా.. నా మీద చేసిన ఆరోపణలు నిరూపించలేకపోయారు. సజ్జల ఏం సలహాదారుడో..? ఏ అర్హతతో జీతాలిస్తున్నారో అర్థం కావడం లేదు.నాపై చేసిన ఆరోపణలను 24 గంటల్లో నిరూపించమని సవాల్ విసిరాను.. కానీ దీనిపై స్పందించ లేదు. బయటకొచ్చి బురద జల్లి ఆరోపణలు చేస్తారు.. ప్యాలెస్ పిల్లి మ్యావ్ మ్యావ్ అంటారు. నా మీద ఏడు అంశాలపై ఆరోపణలు చేశారు.. ఒక్కటి నిరూపించలేకపోయారు. నా మీద అబద్దాలు చెప్పుకుంటూ బతుకుతారు.
వైసీపీ పుటకే అబద్దాల మీద పుట్టింది.దమ్ము ధైర్యం ఉంటే నాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు బయటపెట్టండి.జగన్‌లా నేను పారిపోవడం లేదు.. దమ్ముంటే నిరూపించండంటూ బహిరంగంగా సవాల్ విసురుతున్నాను.ఆధారాల్లేకుండా నా మీద ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తాను. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో నాకెవరైనా మెసేజ్ చేశారా..? నా అకౌంట్‌కు ఏమైనా డబ్బులు వచ్చాయా..? అనే విషయాన్ని ఎందుకు చెప్పడం లేదు.ఫైబర్ గ్రిడ్ విషయంలోనూ నాపై ఆరోపణలు చేశారు.నేను మంత్రిగా ఉన్నప్పుడు ఫైబర్ గ్రిడ్ నా పరిధిలోకి రాదని గతంలోనే చెప్పాను.జగన్‌కు నేనే త్రెట్.. అందుకే నాపై ఆరోపణలు చేస్తున్నారు.ఆధారాలుంటే గర్జించండి.. ఎందుకు మ్యావ్ మ్యావ్ అంటున్నారు.సంపాదించాలంటే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు.స్టాన్ ఫోర్డ్‌లో నాతో చదువుకున్న వాళ్లు.. నెలకు రూ. 30 కోట్లు సంపాదిస్తున్నారు.1500కు ఫైళ్లను క్లియర్ చేశాను.. కానీ ఒక్క తప్పును కూడా వైసీపీ నిరూపించలేకపోయిందన్నారు లోకేష్.
Read Also:Selfie Addict: సెల్ఫీ మోజు.. కాలిపోయిన మర్మాంగం.. చివరికి