ఏపీలో టీడీపీ నేతల అరెస్టులు, నోటీసులపై ఆపార్టీ తీవ్రంగా మండిపడుతోంది. తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడు చింతకాయల విజయ్ కి ఏపీ సీఐడీ నోటీసులు జారీచేసిన అంశం రచ్చరేపుతోంది. ఈ నేపథ్యంలో చింతకాయల విజయ్ కు నోటీసులిచ్చిన అంశంపై పత్రికా ప్రకటన విడుదల చేసింది సీఐడీ.
సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతీ గురించి ఉద్దేశపూర్వకంగా “BharathiPay” అని ఒక తప్పుడు పోస్టింగ్ సృష్టించారు. ఆ తప్పుడు పోస్టింగును సోషల్ మీడియాలో సర్కులేట్ చేశారు. ఈ తప్పుడు పోస్టింగుపై ప్రాథమిక విచారణ చేపట్టాం. దీని వెనుక ITDP పాత్ర వుందని నిర్ధారణకు వచ్చాం. ITDPని చింతకాయల విజయ్ ఆధ్వర్యములో నడుస్తుందని ప్రాధమిక విచారణలో తేలింది. దీని మీద కేసు నమోదు చేసి నోటీసులిచ్చాం. దర్యాప్తునకు చింతకాయల విజయ్ ను సహకరించమని కోరాం.. అని ప్రకటన విడుదల చేసింది.
Read Also: K Ramakrishna: హరీష్ రావు వ్యాఖ్యల్లో తప్పేముంది?
చింతకాయల విజయ్ కి నోటీసులు జారీచేయడం, ఆయన ఇంటికెళ్లి సీఐడీ అధికారులు హడావిడి చేయడంపై టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, తెలంగాణ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీ ప్రభుత్వం టీడీపీ నేతలపై తప్పుడు కేసులు, కక్షసాధింపుచర్యలకు పాల్పడుతోందని వారు ఆరోపించారు.
Read Also: Atchannaidu : తప్పుడు కేసులు పెట్టి వేధిస్తే చూస్తూ ఊరుకోం