తనకు తాను చెప్పుతో కొట్టుకుని ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు. అక్కడితో ఆగకుండా సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రసాదరాజుపై తీవ్ర కామెంట్స్ చేశారు. ఇద్దరి మధ్య సఖ్యత లేదని కొన్నాళ్లుగా చర్చ జరుగుతున్నా.. అది బయటపడిన సందర్భాలు లేవు. కానీ.. నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలన్న ఉద్యమం.. ఆ విభేదాలను బయటపెట్టేసింది. ఇంతకీ సుబ్బారాయుడికి, ప్రసాదరాజుకు ఎక్కడ చెడింది? గుర్తింపు లేదన్న ఆవేదనలో ‘చెప్పు’తో కొట్టేసుకున్నారా?కొత్తపల్లి సుబ్బారాయుడు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పొలిటికల్…
చేసేదే అక్రమం. ఆ అక్రమాన్ని అడ్డంగా క్యాష్ చేసుకుంటున్నారు ఆ చోటామోటా నేతలు. బిజినెస్ బాగుండటం.. గిట్టుబాటు అవుతుండటంతో కొత్త కొత్త ముఠాలు ఈ దందాలో చేరిపోతున్నాయి. పోటీ పెరగడంతో ఒకరి రహస్యాలను ఇంకొకరు పోలీసుల చెవిన వేస్తూ పెద్ద నేతలకు తలనొప్పిగా మారారట. వేలకు వేలు వస్తుండటంతో కొత్త ముఠాలు ఎంట్రీప్రకాశం జిల్లాలో కొత్తరకం దందాకు తెరలేచింది. ‘జిల్లా’లో తరలించే గ్రానైట్ లారీల నుంచి వైసీపీ ద్వితీయశ్రేణి నేతలు వసూళ్లు మొదలుపెట్టారు. ఎప్పుడు ఏ లారీ…
ఎమ్మెల్యే రోజా అనుకున్నది ఒక్కటి అయ్యిందొక్కటా? కంట్లో నలుసుగా మారిన పార్టీ నేతపై చర్య తీసుకోవాలని రోజా కోరితే.. అతడిని పిలిచి కీలకపదవి కట్టబెట్టారా? ఫైర్‌బ్రాండ్ మాట చెల్లుబాటు కాలేదా? నగరిలో హాట్ టాపిక్ మారిన అంశం ఏంటి? రోజాకు సవాల్ విసిరిన వారికి అందలం..?పాపం రోజా..! రాష్ట్రం అంతటికీ ఆమె ఫైర్ బ్రాండ్. ప్రత్యర్థులను తూటాల్లాంటి మాటలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చినా.. ఫక్తు రాజకీయ నేతలా మారిపోయారు రోజా. ఆమె అంటే…
గుంటూరు జిల్లా వినుకొండ వైసీపీలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయా? ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య మొదలైన రచ్చలో.. ఎంపీ కూడా చేరారా? పంచాయితీ సీఎం దగ్గరకు చేరిందా? అసలు వినుకొండ వైసీపీలో ఏం జరుగుతుంది? వినుకొండ వైసీపీలో మొదట్లో అంతా బాగానే ఉందా?వినుకొండ.. ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఈ పేరే హాట్ టాపిక్. గత ఎన్నికల్లో వినుకొండ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన బొల్లా బ్రహ్మనాయుడు గెలిచారు. మొదట్లో వినుకొండ వైసీపీలో అంతా బాగానే ఉన్నా.. కొద్ది…
ఆయన మొదటిసారి ఎమ్మెల్యే. అంతా బాగుంది అని అనుకుంటున్న సమయంలో సొంత కేడరే ఆయనకు పక్కలో బల్లెంలా తయారైందట. విపక్షాల సంగతి ఎలా ఉన్నా.. స్వపక్షం నుంచే ఎమ్మెల్యేకు అవినీతి ఆరోపణలు తప్పడం లేదు. సోషల్ మీడియాలోనూ కామెంట్స్.. పోస్టింగ్స్‌తో కేక పెట్టిస్తున్నారు. వైసీపీలోని వ్యతిరేకవర్గం దెబ్బకు ఉక్కిరిబిక్కిరి..!కృష్ణాజిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో కైకలూరు ఒకటి. పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లా బోర్డర్‌లో ఉంటంతో.. ఇక్కడ ఎవరు గెలిచినా ప్రత్యేకమే. అటువంటి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు దూలం…
ఆ నియోజకవర్గంలో ప్రభుత్వ పథకం అధికారపార్టీలో చీలిక తెచ్చిందా? వర్గపోరు బయటపడిందా? ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ విభేదాలను మరో అంకానికి తీసుకెళ్లాయా? ఏంటా నియోజకవర్గం? ఎవరా ఎమ్మెల్యే? బీసీ, కాపు సామాజికవర్గాల మధ్య ఆధిపత్యపోరు..!సైలెంట్ రాజకీయాలకు పెట్టింది పేరైన తణుకులో ప్రస్తుతం రాజకీయం వాడీవేడిగా ఉంది. అదీ అధికార వైసీపీలో కావడంతో మరింత అటెన్షన్ వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు. ఈ నియోజకవర్గంలో బీసీ, కాపు సామాజికవర్గాల మధ్య ఆధిపత్యపోరు ఉంది. ఆ సమస్య పెద్దగా…
ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు. స్వపక్షంలో విపక్షంగా ఉన్న ఆ ఇద్దరు నేతలకు ఈ సామెత వర్తిస్తుంది. అధిష్ఠానం మందలించినా.. అగ్రనేతలు అదిలించినా వారి పంథా ఒక్కటే. పదవులు కట్టబెట్టినా అదేపట్టు.. అదేబెట్టు. ఒకరికొకరు డీ అంటే డీ అని కాలు దువ్వుతున్నారు. ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా కథ? కత్తులు దూసుకుంటున్నారు.. కాలు దువ్వుతున్నారు..!శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియెజకవర్గంలో అధికార వైసీపీ నేతలు దువ్వాడ శ్రీనివాస్.. పేరాడ తిలక్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల కామెంట్లకు స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి.. ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆమె.. తిరుపతిలో వర్షాలు, వరదలతో మృతిచెందినవారి కుటుంబాలను పరామర్శించారు.. 48 కుటుంబాలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నారా భువనేశ్వరిని.. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, వైసీపీ నేతలు చేసిన కామెంట్లపై ప్రశ్నించారు. రాజకీయాలు నేను మాట్లాడను…
నగరి ఎమ్మెల్యే రోజా స్వపక్షం వారితోనే పోరాడుతుంటారు. తనను ఓడించడానికి అసమ్మతి నేతలు కుట్రపన్నారని గతంలో కన్నీరుపెట్టుకున్నారు. జగన్ కి కంప్లైంట్ చేశారు. తాజాగా రెబల్స్ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. తన ఎదుగుదలను ఆపడానికి ఐదుగు మండల వైసీపీ రెబెల్స్ నాయకులను వెనక నుండి రెచ్చగొట్టి నా పై ఆరోపణలు ఎవరు చేయిస్తున్నారో ఆధారాలతో సహా తన వద్ద ఉందన్నారు రోజా. వారి చిట్టాను జగన్ సమక్షంలో ఆధారాలతో సహా బట్టబయలు చేస్తానని రోజా అన్నారు.…
ఆంధ్రప్రదేశ్‌లో చెడ్డీ గ్యాంగ్‌లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెడ్డి గ్యాంగ్‌కు విఙప్తి అంటూ జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ సెటైర్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో సంచరిస్తున్న చెడ్డి గ్యాంగ్ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రులు, సలహాదారుల ఇళ్లల్లో దోచుకోవాలి. నగర శివారుల్లోని పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లల్లో దోపిడీలు చేయడం సరికాదు. వైసీపీ నేతల ఇళ్లల్లో బోల్డంత డబ్బు ఉంది.. వాటిని దోచుకోండి. ముఖ్యంగా మంత్రి…