గత కొంతకాలంగా సైలెంట్ గా వున్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ స్పీడ్ పెంచారు. నంద్యాల జిల్లా చాగలమర్రిలో అక్రమ కూల్చివేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అఖిలప్రియ. ఇంటిస్థలంపై కోర్టులో కేసు నడుస్తుండగానే పోలీసుల్ని, అధికారుల్ని ముందుపెట్టుకొని ఇంటిని కూల్చారంటూ వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీమంత్రి అఖిల ప్రియ. టీడీపీ ప్రభుత్వం రాగానే మీ కంటే రెండింతలు ఎక్కువ చేస్తాం అంటూ వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు అఖిలప్రియ. వైసీపీ నాయకులకు ఓర్పు లేక, తీవ్రమైన…
ఎస్సీ మహిళ వెంకాయమ్మకు రక్షణ కల్పించాలని గుంటూరు ఎస్పీకి టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తిని తెలిపిన ఎస్సీ మహిళ వెంకాయమ్మకు రక్షణ కల్పించాలని లేఖలో కోరిన అచ్చెన్న.లేఖలో కోరిన అచ్చెన్న.వైసీపీ ప్రభుత్వంపై ప్రజాస్వామ్యబద్ధంగా తమ అసమ్మతి తెలుపుతున్న వారిపై దాడికి పాల్పడుతున్నారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు.ప్రభుత్వం పై తన అసమ్మతి తెలిపిన ఎస్సీ-మాల సామాజిక వర్గానికి చెందిన వెంకాయమ్మపై జరిగిన దాడే ఇందుకు…
జీడీసీసీ బ్యాంకులో పెద్దఎత్తున అక్రమాలు జరిగిన దృష్ట్యా తక్షణమే ఆ సంస్థ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు, సీఈవో కృష్ణవేణిలను పదవుల నుంచి తొలగించాలని సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డితో సమావేశం అయ్యారు. జీడీసీసీ బ్యాంకులో జరుగుతున్న అక్రమాలను నివేదించారు. వీరితో పాటు మొత్తం పాలకవర్గాన్ని రద్దు చేయాలన్నారు. ఇప్పటివరకు జరిగిన అక్రమాల్లో బ్యాంకుతో పాటు రెవెన్యూ అధికారుల ప్రమేయం ఉందన్నారు. రూ.కోట్లలో బ్యాంకు సొమ్ము…
ఏపీలో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. మంత్రులను మార్చడం కాదు.. ముఖ్యమంత్రి నే మారిస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుంది. సత్యసాయి జిల్లాలో వెనువెంటనే రెండు ఘటనలు జరిగాయి. నిన్న నెల్లూరు లో తుపాకీ తో ప్రేమోన్మాది కాల్చి చంపిన ఘటన విచారకరం అన్నారు. రాష్ట్రం లో చిన్న ఘటనలు జరుగుతున్నా సిఎం స్పందించరా అన్నారు. హోం మంత్రి ఈవిషయాల పై నోరు మెదపరా. గవర్నర్…
మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవుల కోసం తాము ముఖ్యమంత్రి జగన్ చుట్టూ తిరగడం లేదన్నారు. నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వరు కదా అన్నారు. బాబులా పదవుల కోసం స్వంతమామకు వెన్నుపోటు పొడిచారన్నారు. మేం పార్టీకోసం పనిచేస్తాం అన్నారు. కేబినెట్లో తమను తీసేశారంటే.. నా మనుషులు.. వీరిని తీసినా ఏం ప్రాబ్లం వుండదని భావించారన్నారు. సింపతీ కబుర్లకు ప్రలోభాలకు గురికావద్దన్నారు కొడాలి నాని. ఆయన వెంట సైనికుడిలా నిలబడతాం. జగన్ నిర్ణయం వెనుక…
ఆ జిల్లాలోని అధికార వైసీపీలో గ్రూపుల గోల పెరిగిపోతోంది. ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి అసంతృప్తి గళాలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఆ జిల్లాలో 3 నియోజకవర్గాల్లో తారాస్థాయిలో విభేదాలు ఉన్నాయి. అధినాయకత్వంపై విధేయత ప్రకటిస్తూనే.. ఎమ్మెల్యేలపై మండిపడుతున్నారు అసమ్మతి వాదులు. ఎచ్చెర్లలో ఎమ్మెల్యే కిరణ్‌పై కేడర్ రుసరుసలుశ్రీకాకుళం జిల్లా వైసీపీలో అంతర్గత కలహాలు భగ్గుమంటున్నాయి. రహస్య సమావేశాలు కాస్త బహిరంగ మీటింగ్స్‌గా మారుతున్నాయి. ఎమ్మెల్యేలతోపాటు, నియెజకవర్గ ఇంఛార్జ్‌లపై అసమ్మతి రాగం వినిపిస్తోంది కేడర్. పార్టీ కోసం…
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో భూ మాఫియా రెచ్చిపోయి కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వెదురుకుప్పం మండలం లోని కొంతమంది నాయకుల అండదండలతో ఫేక్ పట్టాదారు పాసు పుస్తకాలు తయారుచేసి విచ్చలవిడిగా దందా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆళ్ల మడుగు, దేవరగుడిపల్లి, వెదురుకుప్పం, చుట్టుపక్కల ప్రాంతాలలో ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి, ఒక నాయకుడు ఏకంగా గుట్టని,చెరువుల్ని కూడా వదలకుండా గత కొన్ని సంవత్సరాలుగా తన సొంత ప్రయోజనాల కోసం వాడేశారు. తన పేరు…
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం అయ్యవారిపల్లెలో దారుణం చోటుచేసుకుంది. సర్పంచి ఇంటిపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి, చాపాడు మండలం అయ్యవారిపల్లె గ్రామ పంచాయతీ సర్పంచి నివాసంపై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఈ దాడిలో సర్పంచితో పాటు ఆయన సోదరుడి కుటుంబ సభ్యులు ఆరుగురు గాయపడ్డారు. అయ్యవారిపల్లె గ్రామ సర్పంచి కె. రహంతుల్లా నివాసంపై వైసీపీ నేతలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. రహంతుల్లా తిమ్మయ్యగారిపల్లెలోని నివాసంలో నిద్రిస్తుండగా దాడికి పాల్పడ్డారు. ఈ…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ విపక్ష, అధికార పక్ష నేతల మధ్య మాటల యుద్ధం హోరెత్తే అవకాశం కనిపిస్తోంది. మూడు సంవత్సరాలుగా టీడీపీ సభ్యులను అవమానాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు శాసనసభలో టీడీపీ ఉప నేత అచ్చెన్నాయుడు. ప్రతిపక్ష నాయకుడుతో పాటు కుటుంబ సభ్యులను సైతం అవమానిస్తున్నారు. శాసనసభా గౌరవాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు మంట గలుపుతున్నారు. కర్తవ్య బాధ్యతను నెరవేర్చడం కోసం టీడీపీ తరపున సభకు హాజరు అవుతున్నాం. శాసనసభలో ఇన్ని ఇబ్బందులు, అవమానాలు ఎప్పుడు…