రోజా అనుకున్నదొక్కటీ ..అయ్యిందొక్కటా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే రోజా అనుకున్నది ఒక్కటి అయ్యిందొక్కటా? కంట్లో నలుసుగా మారిన పార్టీ నేతపై చర్య తీసుకోవాలని రోజా కోరితే.. అతడిని పిలిచి కీలకపదవి కట్టబెట్టారా? ఫైర్‌బ్రాండ్ మాట చెల్లుబాటు కాలేదా? నగరిలో హాట్ టాపిక్ మారిన అంశం ఏంటి?
రోజాకు సవాల్ విసిరిన వారికి అందలం..?
పాపం రోజా..! రాష్ట్రం అంతటికీ ఆమె ఫైర్ బ్రాండ్. ప్రత్యర్థులను తూటాల్లాంటి మాటలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చినా.. ఫక్తు రాజకీయ నేతలా మారిపోయారు రోజా. ఆమె అంటే ప్రత్యర్థులకు హడల్. ఆమెను ఏమైనా అంటే.. తోకతొక్కిన త్రాచులా లేస్తారు. ఇదంతా ప్రత్యర్థుల విషయంలో మాత్రమే. కానీ.. పార్టీలో ఆమెకు ఫైర్ లేకుండా చేస్తున్నారు ప్రత్యర్థులు. రోజాకు సవాల్ విసిరిన వారికి అందలం దక్కుతోంది. దమ్ముంటే నామీద పోటీ చేసి గెలవమని రోజాకు సవాల్ విసిరిన ఓ మండలస్థాయి నేతకు ఏకంగా శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్ పదవి కట్టబెట్టింది వైసీపీ హైకమాండ్.
Also Read
- AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
- OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
- Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
రెండుసార్లు గెలిపించినవాళ్లే రోజాపై తిరుగుబాటు?
ఎమ్మెల్యే రోజాకు సొంత నియోజకవర్గం నగరిలో విపక్షాల నుంచి సమస్యలు ఉన్నాయో లేదో కానీ స్వపక్ష నేతలు మాత్రం ముప్పుతిప్పలు పెడుతున్నారు. నగరిలో వైసీపీ మూడు, నాలుగు ముక్కలైంది. గత రెండు ఎన్నికల్లో రోజాను గెలిపించడానికి కృషి చేసినవారే.. ఇప్పుడు ఆమె వ్యవహార శైలి నచ్చక తిరుగుబాటు చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ సొంతపార్టీ నుంచే రోజాకు బలమైన ప్రత్యర్థులు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. రెండోసారి ఎమ్మెల్యే అయిన నాటి నుంచి ఆమెకు నగరిలో అసమ్మతి బలపడుతూ వస్తోంది. ఎంతెలా అంటే నియోజకవర్గంలోని నిండ్ర మండలానికి చెందిన రెడ్డివారి చక్రపాణిరెడ్డికి శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ దక్కింది.
తనపై పోటీ చేయాలని రోజాకు పార్టీ నేత చక్రపాణిరెడ్డి సవాల్
చక్రపాణిరెడ్డి తొలినుంచి రోజా ప్రత్యర్థివర్గమే. ఇప్పుడు ఎమ్మెల్యే రోజా ప్రమేయం లేకుండానే ఆయన ప్రతిష్టాత్మక శ్రీశైలం ఆలయ ఛైర్మన్ పోస్ట్ దక్కించుకున్నారంటే.. పార్టీలో చక్రపాణిరెడ్డికి ఉన్న పట్టును అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి రోజా, చక్రపాణిరెడ్డిల మధ్య అంతర్గతంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఎంపీపీ ఎంపిక విషయంలో రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఎంపీడీవో ఆఫీస్ వద్ద ఆందోళన చేశారు. రోజాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కూడా. రెండుసార్లు ఆమెను గెలిపించినందుకు చెప్పు దెబ్బలు తిన్నట్టు అయిందని తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. దమ్ముంటే స్వతంత్ర అభ్యర్థిగా రోజా బరిలో దిగి తనపై పోటీ చేయాలని.. తాను ఓడిపోతే రోజా ఇంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తానని సవాల్ విసిరారు చక్రపాణిరెడ్డి. ఎమ్మెల్యే సైతం ఆ అంశంపై స్పందించారు. పార్టీలో ఉంటూ విప్‌ను ఎలా ధిక్కరిస్తారని మండిపడ్డారు. హైకమాండ్ నిర్ణయాన్ని అంగీకరించకపోతే సీఎం జగన్‌ను అవమానించినట్టేనన్నారు రోజా.
వ్యతిరేకవర్గానికి చెక్ పడుతుందని భావించిన రోజా టీమ్
నిండ్ర ఎంపీపీ వివాదం మొదలుకొని మొన్నటికి మొన్న సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీ వరకు పార్టీ నాయకులు రోజాకు వ్యతిరేకంగా సై అంటే సై అంటున్నారు. నగరి వైసీపీలో రగడపై పలుమార్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు రోజా. తిరుగుబాటు నాయకులను పార్టీ నుంచి తొలగించాలని ఆమె కోరారు. దాంతో వ్యతిరేకవర్గానికి చెక్ పడుతుందని భావించారట. వారికి ఎలాంటి పదవులు రావని అనుకున్నారట. కానీ.. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు ఎమ్మెల్యే రోజాకు.. ఆమె వర్గానికి షాక్ ఇచ్చింది. వైసీపీ నుంచి పంపించేయాలని కోరితే.. ఏకంగా చక్రపాణిరెడ్డికి శ్రీశైలం ఆలయ ఛైర్మన్‌గా అవకాశం కల్పించడం మింగుడుపడటం లేదట. నగరిలో రోజా వ్యతిరేకవర్గానికి పదవులు రావడం వెనక జిల్లా మంత్రి హస్తం ఉందని అనుమానిస్తున్నారట. మొత్తానికి రోజా ఒకటి తలిస్తే పార్టీ మరొకటి చేసిందని అధికారపార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?