Off The Record: వల్లభనేని వంశీ…. ఏపీ పాలిటిక్స్‌లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. గన్నవరం నుంచి రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారాయన. అదే పార్టీ తరపున ఒకసారి విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2024లో వైసీపీ బీ ఫామ్ మీద బరిలో దిగి ఓటమి పాలయ్యారు. అయితే… 2019లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత వైసీపీకి జై కొట్టారు వంశీ. ఆ క్రమంలోనే… 2019 నుంచి 2024 మధ్య…
Off The Record: ఉన్నట్టుండి ఉలిక్కిపడి నిద్ర లేచినట్టు… తెగ హడావిడి చేసేస్తున్నారు ఆ మాజీ ఎంపీ. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత అసలు ఎక్కడున్నాడో కూడా తెలియని సదరు నేత.. ఇప్పుడు మాత్రం పిలవకుండానే పలుకుతూ… ఇక్కడెవరన్నా నన్ను పిలిచారా అంటూ డైరెక్ట్‌గా సీన్‌లోకి వచ్చేస్తున్నారట. ఇంతలోనే అంత మార్పు ఏంటి? ఎవరా లీడర్? పార్టీ అధిష్టానం నుంచి ఆయనకు పే…ద్ద భరోసా వచ్చిందన్నది నిజమేనా? మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఉన్నట్టుండి యాక్టివ్…
Vidadala Rajini: జగన్ పర్యటన సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన కేసులో మాజీ మంత్రి విడదల రజినీని నేడు సత్తెనపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరు అయ్యారు. అలాగే మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో విచారణకు హాజరయ్యారు. ఇక విచారణ అంతరం విడుదల రజిని మాట్లాడుతూ.. జగన్ పర్యటనకు జనసమీకరణ చేశామని కేసులు పెట్టారన్నారు. మేము జనసమీకరణ చేయలేదుని.. జగన్ పర్యటనకు వస్తున్నారని తెలిస్తే…
Perni Nani: ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆవేదనతో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. జగన్ జెండా మోసిన కార్యకర్తల ఇంట్లో జువ్వలు, టపాసులు కాల్చి ఇంట్లో వేసి మానసిక ఆనందం పొందారు. అలాగే కార్యకర్తల ఇంట్లో పూల కుండీలను బద్దలు కొట్టడం, కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగడం చేసారని ఆరోపించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఆలస్యం కావడానికి మధ్యలో…
ఆంధ్రప్రదేవ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను వైసీపీ నేతల బృందం కలిసింది. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు, అక్రమ కేసులు, వ్యవస్థల నిర్వీర్యంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ను కలిసిన వారిలో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు విడదల రజినీ.. వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు పలువురు నేతలు ఉన్నారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసు నమోదు చేశారు గుంటూరులో పోలీసులు.. ఈ రోజు గుంటూరు మిర్చి యార్డ్‌లో వైఎస్ జగన్ పర్యటించిన విషయం విదితమే కాగా.. ఈ పర్యటన నేపథ్యంలో వైఎస్ జగన్ సహా 8 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు..
వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్నీ నిర్ణయాలను ముఖ్య నేతలతో చర్చించి మాజీ సీఎం, వైఎస్ జగన్ నిర్ణయం తీసుకుంటున్నారు. గుంటూరు, అనంతపురం జిల్లాలకు సంబంధించిన పలు పార్టీ అంశాలపై వారు ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలు, పోలవరం, హామీల అమలు తీరుపై చర్చ జరిపినట్లు తెలుస్తుంది.
ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన నేతలతో వైసీపీ అధినేత జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరవుతారు. సమావేశంలో భాగంగా జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై వైసీపీ అధినేత జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.