మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవుల కోసం తాము ముఖ్యమంత్రి జగన్ చుట్టూ తిరగడం లేదన్నారు. నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వరు కదా అన్నారు. బాబులా పదవుల కోసం స్వంతమామకు వెన్నుపోటు పొడిచారన్నారు. మేం పార్టీకోసం పనిచేస్తాం అన్నారు. కేబినెట్లో తమను తీసేశారంటే.. నా మనుషులు.. వీరిని తీసినా ఏం ప్రాబ్లం వుండదని భావించారన్నారు.
సింపతీ కబుర్లకు ప్రలోభాలకు గురికావద్దన్నారు కొడాలి నాని. ఆయన వెంట సైనికుడిలా నిలబడతాం. జగన్ నిర్ణయం వెనుక ఎంతో ఆలోచన వుంటుందన్నారు. జగన్ అంత నమ్మకం కలిగిన వ్యక్తి ఎవరూ లేరన్నారు. విప్లవాత్మక మార్పు తేవాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన లాంటి వ్యక్తులు అరుదుగా వుంటారు. ఎన్టీఆర్ బడుగు, బలహీనవర్గాలకు పదవులు, రాజ్యాధికారం ఇచ్చారు. ఆయన పోయినా 25 ఏళ్ళ తర్వాత కూడా ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన తర్వాత జగన్ అలాంటి ప్రయత్నం చేస్తున్నారన్నారు. వైసీపీలో జగన్ పార్టీలో రెండేళ్ళు పనిచేయాలని టీంలో పెట్టారు. మంత్రిపదవి కోసం ఎవరినీ తిట్లలేదన్నారు. నాకు మంత్రి పదవి ఈకముక్కతో సమానం. చంద్రబాబు లాంటి నీచుడు పదవుల కోసం, ఎంగిలిమెతుకుల కోసం తిరుగుతారు.
జగన్ గ్యారేజీ. ఆయన్ని కాపాడుకోవాలి. జగన్ కి అంతా మద్దతివ్వాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నతస్థానంలో అధికారం అనుభవిస్తున్నారు. మాజీలయిన మేమంతా మా గౌరవం కోసం తిరగడం లేదు. ఆయన ఏం నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తాం. భవిష్యత్ ని ఆలోచించి మాకు స్నేహితుడిలా మారారు. ఎవరి పర్మిషన్ అవసరం లేకుండా ఆయనతో తిరిగాం. తుచ్చమయిన, నీచమయిన వ్యక్తుల మాటల్ని మేం పట్టించుకోం. ఆయన నాకు హామీ ఇచ్చారు. అది నాకూ ఆయనకూ తెలుసు.