YS Vimala Reddy Sensational Comments On YS Viveka Case: వైఎస్ వివేకా హత్యపై వైఎస్సార్ సోదరి వైఎస్ విమలారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాను చంపిన వారు బయట తిరుగుతున్నారని, తప్పు చేయని వారిని మాత్రం జైల్లో పెట్టారని పేర్కొన్నారు. ఈ కేసులో అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసి వేధిస్తున్నారని చెప్పారు. బుధవారం వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చిన విమలారెడ్డి.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. శ్రీలక్ష్మి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని, ఆమె ఇంకా లిక్విడ్స్‌పైనే ఉందని, మృత్యువు దగ్గరికి వెళ్లి వచ్చిందని తెలిపారు. భర్త జైలులో ఉండడం, కొడుకు అవినాష్ జైలుకు వెళ్తారని ప్రచారం జరుగుతుండటంతో.. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందన్నారు. అవినాష్ రెడ్డిపై అసత్య ఆరోపణలు వస్తుండటం వల్లే.. శ్రీలక్ష్మి తల్లడిల్లిపోతోందని చెప్పారు. ఆమె ఉపవాసాలు ఎక్కువ చేస్తోందని, దీంతో లోబీపీ వచ్చిందని స్పష్టం చేశారు.
Child Marriage: దారుణం.. డబ్బుల కోసం ఏడేళ్ల బాలికతో 38 ఏళ్ల వ్యక్తి పెళ్లి
వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని టార్గెట్ చేశారని, ఏ తప్పు చేయని అతడ్ని టార్గెట్ చేయడం ఏమాత్రం సరికాదని విమలారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేయని వాళ్లు బాధపడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. వివేకా హత్యలో అవినాష్ ప్రమేయం ఏమాత్రం లేదని, ఇప్పటికే అవినాష్ ఏడుసార్లు విచారణకు హాజరయ్యారని, అయినా మీడియా ఎందుకు ఇంత హడావుడి చేస్తుందో అర్థం కావడం లేదని చెప్పారు. వివేకాను చంపిన వ్యక్తులు బయట తిరుగుతుంటే.. తప్పు చేయని అవినాష్ కుటుంబం మాత్రం ఎంతో బాధపడుతోందని వెల్లడించారు. మొదట తన కుటుంబం ఎవరినీ హత్య చేయలేదని చెప్పిన సునీత.. ఆ తర్వాత ఆమె మాట మార్చిందన్నారు. ఇది తప్పు అని తాము చెప్పినందుకు.. సునీత తమతో మాట్లాడడం మానేసిందన్నారు. ఆమె ఎందుకలా మాట మార్చిందో తెలిదయన్నారు. సునీత వెనుక కొన్ని దుష్టశక్తులు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఆలస్యమైనా న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో అవినాష్ ఉన్నారని తెలియజేశారు.
Daggubati Purandeswari: ఏపీ ప్రభుత్వంపై పురంధేశ్వరి సంచలన ఆరోపణలు