మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తులను సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని ఆదివారం సీబీఐ విచారించనుంది.
YS Viveka murder case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది.. నిందితులను ఇవాళ ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు అధికారులు.. దీనికోసం కడప జైల్‌లో ఉన్న నిందితులు సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డిలను ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య ఈ తెల్లవారుజామున 4 గంటలకు కడప జైలు నుంచి హైదరాబాద్‌కు…
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి నేడు సీబీఐ ఎదుట హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రానున్నారు. అవినాష్ రెడ్డికి అడిగే ప్రశ్నలు ఏంటి ఎంతటైం ప్రశ్నిస్తారు.. మళ్లీ వస్తారా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
Andhra Pradesh: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ తీర్పు వెలువరించింది. హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టు ఈ కేసును విచారిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివేకానందరెడ్డి కూతురు సునీత పిటిషన్‌పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పు చెప్పింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తిగిరికి, అలాగే ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులకి రక్షిణ కల్పించాలంటూ.. టీడీపీ నేత వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. ఈ కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారినప్పటి నుంచి అతనికి ప్రాణహాని ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే.. అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు అతనిపై తప్పులు కేసులు బనాయిస్తున్నారని, చివరికి సీబీఐ బృందాన్ని కూడా విడిచిపెట్టడం లేదని అన్నారు.…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితులకు బెయిలుపై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది.. సీబీఐ, నిందితుల తరపున వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.. అయితే, సీబీఐ విచారణ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పాలని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది.. వివేకా హత్య కేసు వెనుక కుట్ర ఉందని తెలిపిన సీబీఐ.. జైలులో ఉండే నిందితులు సాక్ష్యులను బెదిరిస్తున్నారని వాదించింది.. Read Also: North…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది… ఈ వ్యవహారంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విమర్శలు ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి… తాజాగా, ఆ విషయంపై స్పందించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. సీఎం వైఎస్ జగన్ సొంత బాబాయి (వైఎస్ వివేకానందరెడ్డి)ని ఎవరు చంపారో క్లారిటీ వచ్చిందన్నారు.. సీబీఐ విచారణలో అవినాష్ రెడ్డి ప్రథమ ముద్దాయిగా.. జగన్ కూడా అందులో భాగస్వామిగా తేలిందని వ్యాఖ్యానించిన ఆయన.. వైఎస్ వివేకా…
మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకా హత్య కేసు మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది.. అయితే, ఈ కేసుపై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.. వివేకా హత్యపై ఎన్నో నాటకాలాడి కట్టు కథలు అల్లారని మండిపడ్డ ఆయన.. నేనే అవినాష్ రెడ్డిని పిలిపించి రక్తం మరకలు తుడిపించానట అంటూ సెటైర్లు వేశారు.. వివేకాను హత్య చేసిన అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఎర్రగంగి రెడ్డి సహా చివరికి జగన్ కూడా మన మనిషేనట అంటూ…
మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన కూతురు సునీతారెడ్డి… ఈ కేసులో సీబీఐకి సునీతారెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలోని కీలక అంశాలను బయటపెట్టారు.. మా నాన్నను ఎవరు చంపారో అందరికీ తెలుసన్న ఆమె.. నాన్న హత్యపై భారతి, జగన్ చాలా తేలిగ్గా స్పందించారని పేర్కొన్నారు.. నాన్న హత్య విషయంలో జగనన్న వ్యాఖ్యలు బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు.. హత్య గురించి అనుమానితుల పేర్లను జగనన్నకు చెప్పా..…