మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో స్పీడ్ పెంచింది సీబీఐ.. ఇప్పటికే వాచ్‌మెన్ రంగయ్య వాంగ్మూలం ఇవ్వడంతో.. అది ఈ కేసులు చాలా కీలకంగా మారింది.. అయితే, ఇవాళ ఈ కేసులో మాజీ డ్రైవర్ దస్తగిరి, ఆయన భార్యను పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో విచారిస్తున్నారు సీబీఐ అధికారులు.. ఇప్పటికే పలు మార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు దస్తగిరి… ఇవాళ పులివెందుల కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉందని తెలుస్తోంది.. మధ్యాహ్నం…
ఏపీ, తెలంగాణలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో విచారణ చాలా కాలం ముందుకు సాగడంలేదనే విమర్శలు వచ్చాయి.. అయితే, ఉన్నట్టుండి వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు జరిగాయి.. ఆ కేసు పర్యవేక్షణ అధికారి సుధాసింగ్‌ను మార్చేసింది సీబీఐ.. ఈ మార్పు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే వాచ్‌మాన్ రంగయ్యను జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు సీబీఐ అధికారులు.. ఇక, న్యాయమూర్తి సమక్షంలో రంగయ్య ఇచ్చిన వాగ్మూలంతో సంచలన విషయాలు…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కాస్త ముందడుగు పడింది.. ఈ కేసులో వాచ్‌మన్ రంగయ్య తన స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు బయటపెట్టారు.. అయితే, రంగయ్య వ్యాఖ్యలపై స్పందించారు వివేకానంద రెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్రగంగి రెడ్డి.. అసలు వాచ్ మెన్ రంగయ్యతో నాకు పరిచయమే లేదన్న ఆయన.. నేను ఎవరిని బెదిరించలేదన్నారు… కడప, పులివెందులలో బెదిరించినట్లు నాపై కేసులు కూడా ఎక్కడా లేవు?…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీమంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పురోగతి సాధించింది.. ఈ కేసులో సుదీర్ఘ విచారణ కొనసాగిస్తున్న సీబీఐ.. వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మెన్ రంగయ్య నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది.. రంగయ్య తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు.. వివేకా హత్యకు రూ. 8 కోట్లు సుపారీ ఇచ్చినట్లు తెలిపిన ఆయన.. ఈ హత్యలో తొమ్మిది మంది భాగంగా ఉన్నారని తెలిపారు. హత్య…
వైయస్ వివేకా హత్య కేసులో 14వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతుంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో విచారణ జరుగుతుంది. వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి వరుసగా నాలుగో రోజు విచారణకు హాజరయ్యాడు. అయితే ఎర్ర గంగిరెడ్డితో పాటు రాఘవేంద్ర రెడ్డి, సింహాద్రిపురం నుంచి వ్యవసాయ కూలీ ఓబుల్ పతి నాయుడు, కదిరికి చెందిన కిషోర్ కుమార్ రెడ్డి, పులివెందులకు చెందిన దంపతులు కృష్ణా, సావిత్రి తో కలిపి నేడు మొత్తం ఆరు మంది…