ఏపీలో రాజకీయం ప్రస్తుతం వైఎస్ వివేకా హత్య కేసు చుట్టూ నడుస్తోంది. వైఎస్ వివేకా హత్య వెనుక సీఎం జగన్ హస్తం ఉండొచ్చని వివేకా అల్లుడు రాజశేఖర్ సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడంపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ టీడీపీ నేత చంద్రబాబు చేతిలో పావులుగా మారారని ఆయన ఆరోపించారు. దీంతో సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి…
వైఎస్ వివేకా హత్య కేసులో టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యవస్థను అడ్డం పెట్టుకొని వివేకానంద రెడ్డి హత్య కేసులో కొన్ని శక్తులు పని చేస్తున్నాయని ఆరోపించారు. సీఎం జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్ర జరుగుతోందని.. ఈ కుట్ర ఇప్పుడు పరాకాష్టకు చేరిందని సజ్జల వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ కుటుంబాన్ని ఇరికించేలా పూర్తిగా రాజకీయపరమైన కుట్రను ఒక ముఠా…
మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి చర్చగా మారింది.. ఈ కేసులో సీబీఐకి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం సంచలనంగా మారింది.. ఇక, ఆమె అవినాష్‌రెడ్డి పాత్రపై విచారణ జరపాలంటూ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయడంతో.. వాంగ్మాలంలో సీఎం వైఎస్ జగన్ పేరు ప్రస్తావించడం పెద్ద చర్చకు దారి తీసింది.. ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. సంచలన వ్యాఖ్యలు…
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి హస్తం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. 2019 ఎన్నికలకు ముందు జరిగిన వివేకా హత్య సీఎం జగన్‌ను ఎంతో కుంగదీసిందని ఆయన పేర్కొన్నారు. వివేకా హత్యపై కొన్ని మీడియా సంస్థలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని సజ్జల మండిపడ్డారు. సీబీఐ ఛార్జ్‌షీట్ పేరుతో కేసుతో సంబంధం లేని వారిపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.. ఈ కేసులో తాజాగా మరో వ్యక్తిని అరెస్ట్ చేసింది సీబీఐ.. హైదరాబాద్‌లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు… ఈ కేసులో డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే కాగా.. వివేకాను హత్య చేస్తే 40 కోట్లు ఇస్తారంటూ వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పాడని దస్తగిరి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు.. అయితే,…
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న సునీల్ యాదవ్ ను నార్కో పరీక్షలకు అనుమతి కోసం జమ్మలమడుగు కోర్టులో ప్రవేశపెట్టారు. నార్కో పరీక్షలు జరపాలంటే న్యాయస్థానం అనుమతించడంతో పాటు, నార్కో పరీక్షలు చేయించుకునే వ్యక్తి అంగీకారం కూడా అవసరం. ఈ నేపథ్యంలో, న్యాయమూర్తి స్పందిస్తూ, నార్కో పరీక్షలకు సమ్మతమేనా? అని సునీల్ యాదవ్ ను అడిగారు. నార్కో పరీక్షలకు తాను అంగీకరించబోనని సునీల్ యాదవ్…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 71వ రోజు విచారణలో భాగంగా వైఎస్ కుటుంబంలోని వైఎస్ ప్రకాశ్‌రెడ్డిని కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విచారిస్తుంది. పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో జరుగుతోన్న ఈ విచారణలో వివేక హత్యకు సంబంధించి పలు కోణాల్లో వారిని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ వివేకాకు ఏమైనా ఆస్తి తగాదాలు, రాజకీయ విభేదాలు, చంపుకునేంత వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో విచారిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. కాగా, వైఎస్ కుటుంబంలో పెద్ద వయసు గల వ్యక్తి వైఎస్…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తుల్ని పదునైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు సీబీఐ అధికారులు. ఈ క్రమంలో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏలు రాఘవరెడ్డి, రమణారెడ్డిలతో పాటు హోంగార్డు నాగభూషణం, వేంపల్లికి చెందిన రహంతుల్లా, బండి కేశవ, మల్లీ అనే వ్యక్తులను విచారించారు. పులివెందుల ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో 8 మంది అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని తొలుత స్థానిక పోలీసులకు ఎలా…
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాల అన్వేషణకు బ్రేక్ పడింది… తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకూ ఆయుధాల కోసం తవ్వకాలు నిలిపివేయాలంటూ మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది సీబీఐ… దీంతో, రోటరీపురం, గరండాల వాగు వద్ద తవ్వకాలు నిలిపివేశారు.. బారికేడ్లు తొలగించి పోలీసుల పికేటింగ్‌ను ఎత్తేశారు అధికారులు.. ఇక, ఆ రహదారి గుండా యథావిథిగా ప్రయాణించేందుకు అనుమతి ఇస్తున్నారు.. కాగా, మూడు రోజుల పాటు తవ్వకాలు చేసినా ఆయుధాలు లభించలేదు.. మురికి…
ఏపీ, తెలంగాణలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో విచారణ చాలా కాలం ముందుకు సాగడంలేదనే విమర్శలు వచ్చాయి.. అయితే, ఉన్నట్టుండి వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు జరిగాయి.. ఆ కేసు పర్యవేక్షణ అధికారి సుధాసింగ్‌ను మార్చేసింది సీబీఐ.. ఈ మార్పు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే వాచ్‌మాన్ రంగయ్యను జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు సీబీఐ అధికారులు.. ఇక, న్యాయమూర్తి సమక్షంలో రంగయ్య ఇచ్చిన వాగ్మూలంతో సంచలన విషయాలు…