YS Viveka Murder Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరిగింది.. ఈ కేసులో తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసు సిబ్బందిపై తాజాగా చర్యలు ప్రారంభమయ్యాయి. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు రాజశేఖర్, అలాగే సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ పై తప్పుడు కేసులు నమోదు చేసిన ఇద్దరు పోలీసు అధికారులపై కేసులు నమోదైనట్లు సమాచారం.…
మాజీ రాష్ట్ర మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి 2019 మార్చి 15 తెల్లవారేసరికల్లా పులివెందులలోని తన స్వంత ఇంట్లో అనుమానాస్పద రీతిలో మరణించిన విషయం తెలిసిందే. మొదట గుండెపోటు కారణంగా మరణించాడని నివేదికలు వచ్చినా, క్రమేపీ వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడన్న విషయం సంచలనం సృష్టించింది. ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. తాజాగా వివేకా హత్యపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హత్య జరిగిందని అందరికీ తెలుసు అని అన్నారు. మన కళ్లముందే హత్య జరిగినా…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.. ఈ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైఎస్ వివేకా కూతురు డాక్టర్ సునీతా రెడ్డి.. కేసులో మరింత విచారణ జరపాలి, కేసుతో సంబంధం ఉన్న కొందరి బెయిల్‌లను కూడా రద్దు చేయాలని వైఎస్ వివేకా కూతురు తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. జస్టిస్ ఎం ఎం సుందరేష్, ఎంకే సింగ్ ల ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది.. అయితే, ఈ కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.. ఈ కేసులో తదుపరి సీబీఐ విచారణ అవసరమా? లేదా? అనేదానిపై సమయం కోరారు అడిషనల్ సొలిసిటర్ జనరల్ కే ఎస్ ఎన్ రాజు.. దీంతో, తదుపరి విచారణ పై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది..
మాజీ మంత్రి వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. బాబాయిని చంపి నా మీదే ఆరోపణలు చేశారు.. మొదట గుండెపోటు అన్నారు.. పోస్టుమార్టం తర్వాత మా నాన్న లేరు... చిన్నాన్న హత్యకు గురయ్యారన్నారు. మరుసటిరోజు నారాసుర రక్తచరిత్ర అన్నారు అంటూ ఫైర్ అయ్యారు.. అయితే, ఆ రోజే నిందితులను అరెస్టు చేసి ఉంటే ఇలాంటివి జరిగేనా..? అని ప్రశ్నించారు చంద్రబాబు..
వైఎస్ వివేకానందరెడ్డి కేసులో విచారణ జరుగుతోంది.. అయితే, విచారణ పేరుతో మా కుటుంబాన్ని వేధిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ కేసులో సాక్షిగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి భార్య పద్మావతి.. కడప జిల్లా పులివెందులలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన పద్మావతి.. శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యపై పోలీసులు మళ్లీ మా కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.. విచారణ పేరుతో మా కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు.. కేసు విషయం పోలీసులు పొద్దుటూరు, బెంగళూరులో కలిశారని తెలిపారు..
వైఎస్ వివేకా కేసులో ఇన్వెస్టిగేషన్ ఆగిపోయిందన్నారు వైఎస్ సునీత.. ఈ దారుణమైన హత్య గురించి పోరాడుతూనే ఉన్నా.. ఇంత అన్యాయం జరిగినా.. నాకు న్యాయం జరగలేదన్నారు.. అయినా, న్యాయపోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు. ఎంతవరకైనా పోరాటం చేస్తానన్న సునీత.. నిందితుల కంటే మాకు, మా కుటుంబానికి ఎక్కువ శిక్ష పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు..
కడప వైద్యులతో పాటు ఫోరెన్సిక్ నిపుణుచేత రంగన్న మృతి దేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. విజయవాడ, తిరుపతి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు, కడప రిమ్స్ వైద్య బృందం ఆధ్వర్యంలో పులివెందుల పోలీసులు.. పులివెందుల ఆర్డీవో సమక్షంలో మరోసారి పోస్టుమార్టం చేశారు. పూడ్చిపెట్టిన రంగన్న మృతదేహాన్ని వెలికి తీసి శరీరంపైన ఎక్కడైనా గాయాలు ఉన్నాయా? లేదా? అనే అంశంపై క్షుణ్ణంగా వైద్య బృందం పరిశీలించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి, వాచ్‌మెన్ రంగన్న మృతి పై అనుమానాలు ఉన్నాయంటూ ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో రంగన్న మృతి గల కారణాలను సమగ్రంగా విచారించడం కోసం కడప ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడో మరోసారి తెరపైకి వచ్చింది.. ఈ కేసులో సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. వివేక హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై విచారణ చేస్తామన్న ఆమె.. సాక్షుల వరుస మరణాల అంశంపై కేబినెట్‌లో చర్చించాం సమగ్ర దర్యాప్తు జరపాలని అదేశించాం అన్నారు..