మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఇవాళ ఎంపీ అవినాష్‌రెడ్డిని ప్రశ్నించనుంది సీబీఐ. ఇవాళ్టి నుంచి ఆరురోజులపాటు విచారించనుంది. ఈనెల 24 వరకు ఆయన్ని ప్రశ్నించనుంది సీబీఐ టీమ్.. అయితే, ఈ నెల 25 వరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సీబీఐని ఆదేశించింది ఇప్పటికే తెలంగాణ హైకోర్టు. అప్పటి వరకు ప్రతి రోజూ సీబీఐ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అవినాష్ రెడ్డి విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని తెల్పింది. విచారణ సమయంలో ప్రశ్నలను లిఖితపూర్వకంగానే…
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ హడావిడి చేస్తోందన్నారు.
వైఎస్ వివేకా వివాహేతర సంబంధాల గురించి చెప్పుకుంటే కుటుంబ పరువు పోతుందని అప్పట్లో చెప్పలేదన్న వైవీ సుబ్బారెడ్డి.. ఇప్పుడు ఈ విషయాలు బయటకు చెప్పక తప్పని పరిస్థితులు వచ్చాయన్నారు.
YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కే సులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగనుంది.. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సోమవారం రోజు విచారణ జరగగా.. తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది కోర్టు.. మధ్యాహ్నం లోపు అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.. ఇక, సోమవారం రోజు అవినాష్‌రెడ్డిని విచారణకు పిలవొద్దని…
YS Viveka Case: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడుపెంచింది.. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ పూర్తి చేయడానికి సిద్ధమైన సీబీఐ అధికారులు.. ఓవైపు విచారణ, మరోవైపు అరెస్ట్‌లు చేస్తోంది.. ఇక, ఈ కేసులో ఈ రోజు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలలయానికి…
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించారు. దీంతో ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణను కొనసాగిస్తోంది. పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసింది. భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు. విచారణలో కీలక విషయాలను సీబీఐ వదిలేసిందని.. సిల్లీ విషయాలను సీరియస్‌గా తీసుకుంటోందని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.