పల్నాడు జిల్లా రాజకీయాలు హాట్ హాట్ గా ఉంటాయి. టీడీపీ వర్సెస్ వైసీపీ నేతలు మాటల యుద్ధంతో వాతావరణాన్ని మరింతగా వేడెక్కిస్తున్నారు. యరపతినేని శ్రీనివాసరావు హాట్ కామెంట్లు చేశారు. ఏపీ లో టిడిపి గెలవబోతుంది అని కేంద్ర పెద్దలకు కూడా తెలిసిపోయింది. అదే విషయం సీఎం జగన్ కు అమిత్ షా చెప్పి పంపించారన్నారు. బాబాయ్ వైవెస్ వివేకాని చంపిన కేసుల్లో ఏపీ సీఎం ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు…మాచర్ల లో పిన్నెల్లి సోదరుల అరాచకాలకు చరమగీతం పాడేందుకు టిడిపి కార్యకర్తలు కొదమ సింహాలు గా మారాల్సిన అవసరం వచ్చిందన్నారు యరపతినేని.
Read Also: Cyber Fraud: రెచ్చిపోయిన సైబర్ కేటుగాళ్ళు
మాచర్ల లో 20 వేల మెజారిటీ తో బ్రహ్మారెడ్డి గెలవబోతున్నాడని యరపతినేని జోస్యం చెప్పారు. సొంత పార్టీ కార్యకర్తల దగ్గర డబ్బులు వసూలు చేసిన చరిత్ర పిన్నెల్లి సోదరులది అని ఆయన మండిపడ్డారు. నేను బ్రహ్మా రెడ్డి సొంత అన్నదమ్ములం కాకపోయినా అంతకు మించి పల్నాడు ప్రాంతంలో సోదర భావంతో పని చేస్తాం అన్నారు. పల్నాడులో టిడిపి నాయకులను వేధించిన ప్రతి పోలీసు చరిత్ర రాస్తున్నాం…రాబోయే కాలంలో అందరి లెక్కలు అప్పజెప్తాం అన్నారు యరపతినేని శ్రీనివాసరావు.
Read Also: Viral Video: ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో దురుసు ప్రవర్తన.. కంటతడి పెట్టిన పోలీస్.. వీడియో వైరల్