మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్‌రెడ్డి హఠాన్మరణం చెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం రాత్రి ఆయన మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, నిద్రపోయిన సమయంలో అనారోగ్యంతోనే గంగాధర్‌రెడ్డి మృతిచెందినట్లు అతని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. తనకు ప్రాణహాని ఉందంటూ గతంలో జిల్లా…
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తిగిరికి, అలాగే ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులకి రక్షిణ కల్పించాలంటూ.. టీడీపీ నేత వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. ఈ కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారినప్పటి నుంచి అతనికి ప్రాణహాని ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే.. అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు అతనిపై తప్పులు కేసులు బనాయిస్తున్నారని, చివరికి సీబీఐ బృందాన్ని కూడా విడిచిపెట్టడం లేదని అన్నారు.…
కడప జిల్లా : మాజీ మంత్రి వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా…. ఉన్న దేవి రెడ్డి శంకర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. దేవి రెడ్డి శంకర్ రెడ్డిని ఇవాళ మధ్యాహ్నం అదుపు లోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని అదపులోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు. దేవి…