సుప్రీంకోర్టులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముందుస్తు బెయిల్ కోసం ఎంపీ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకునే హక్కు అవినాష్ రెడ్డికి ఉందని సుప్రీంకోర్టు బెంచ్ తేల్చి చెప్పింది.
YS Viveka Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎంపీ అవినాష్‌రెడ్డి.. వెకేషన్ బెంచ్ జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ నరసింహ ధర్మాసనం ముందు అవినాష్ న్యాయవాది మెన్షన్ చేశారు. అయితే, పిటిషన్ తమ ముందుకు విచారణకు రావట్లేదని.. మరో వెకేషన్ బెంచ్ ముందుకు వెళ్లాలని సుప్రీంకోర్టు…
వైఎస్ వివేక మృతి కేసులో సోమవారం విచారణకు రాలేనని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కేంద్ర దర్యాప్తు బృందానికి లేఖ రాశారు. తన తల్లి ఆరోగ్యం బాగోలేనందుకు విచారణకు రాలేకపోతున్నాను అంటూ తెలిపారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగి రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై అశ్చర్యాన్ని వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్.. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సీజేఐ.. బెయిల్ ను రద్దుచేసి మళ్లీ ఫలానా రోజున విడుదల చేయాలంటూ ఇచ్చిన…
MP Avinash Reddy: సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ రోజు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విచారణకు హాజరుకావాల్సి ఉంది.. ఎంపీ అవినాష్ రెడ్డికి 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన సీబీఐ అధికారులు.. ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించారు.. అయితే, ఈరోజు విచారణకు హాజరు కాలేనంటూ సీబీఐకి విజ్ఞప్తి చేశారు వైఎస్ అవినాష్‌రెడ్డి.. షార్ట్ నోటీసుతో…
YS Viveka Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఉత్కంఠ రేపుతోంది.. ఈ రోజు మరోసారి సీబీఐ ముందు విచారణకు హాజరుకానున్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.. ఇప్పటికే ఆరు సార్లు ఆయనను ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.. ఇక, మరోసారి విచారణకు హాజరుకావాలంటూ.. ఎంపీ అవినాష్ రెడ్డికి 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు సీబీఐ అధికారులు.. దీంతో.. ఈ రోజు ఉదయం…
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎర్ర గంగి రెడ్డి హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి కొంతకాలంగా బెయిల్‌పై బయట ఉన్నారు. తాజాగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఆయన సీబీఐ కోర్టులో లొంగిపోయారు.