ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ ముదిరిపోతోంది. సీఎం జగన్ పై దారుణమైన రాజకీయ కుట్ర జరుగుతుందని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ రాజకీయ కుట్ర చేస్తున్నారు. జగన్ వ్యక్తిత్వం తక్కువ చేసే కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కుట్రలో భాగంగానే వివేకా హత్య కేసులో జగన్ పై ఆరోపణలు చేస్తున్నారని సుధాకర్ బాబు అన్నారు. ముద్దాయి దస్తగిరి బయటకి వచ్చి హత్య చేసిన విధానం చెప్పడం ఏంటి..?గొడ్డలితో నరికానని చెప్తుంటే సునీత ఎందుకు సైలెంట్ గా ఉన్నారు..?సునీత భర్త కు ఈ హత్యలో సంబంధం ఉంది.. ఆ యాంగిల్ లో విచారణ జరపాలి.
Read Also: Kamareddy: రాష్ట్రంలో మరో కొత్త మండలం..ఉత్తర్వులు జారీ
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో చంద్రబాబు తొలి ముద్దాయి.తొలి ముద్దాయిగా చంద్రబాబును చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. హత్య జరిగినప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మూడు నెలలు విచారణ చేశారు.అప్పుడెందుకు అవినాష్, భాస్కర్ రెడ్డి పేర్లు రాలేదు..?బాధితుల్ని ముద్దయిలుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్రానికి కావాల్సిన నిధుల సేకరణ కోసం సీఎం జగన్ ఢిల్లీ వెళ్ళడం సాధారణం. ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా టిడిపి తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు సుధాకర్ బాబు.
Read Also: Uttam Kumar: మేము ఒప్పుకోము? రేవంత్ పై ఉత్తమ్ ఫైర్