Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajma Chawal: రోజువారీ బిజీ జీవితంలో తక్కువ సమయంలో ఆరోగ్యకరమైన భోజనం తయారు చేయడం చాలామందికి సవాల్‌గా మారుతోంది. అలాంటి వారికి “రాజ్మా రైస్” మంచి ఎంపిక. ప్రోటీన్ సమృద్ధిగా ఉండే రాజ్మాతో తయారయ్యే ఈ వంటకం రుచికరంగా ఉండటమే కాకుండా.. శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. మధ్యాహ్న భోజనంగా లేదా రాత్రి డిన్నర్గా దీన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా తయు చేయాలో చూసేద్దామా..
కావలసిన పదార్థాలు:
* రాజ్మా – ½ కప్పు
* బియ్యం (సోనామసూరి లేదా బాస్మతి) – 1½ కప్పులు
* టమాటాలు – 250 గ్రాములు
* పెరుగు – 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు
* ఉల్లిపాయ – ¾ కప్పు (సన్నగా తరిగినది)
* పచ్చిమిర్చి – 2
* అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
* జీలకర్ర – 1 టీ స్పూన్
* ఎండుమిర్చి – 2
* ఇంగువ – చిటికెడు
* పసుపు – ½ టీ స్పూన్
* కారం పొడి – 1½ నుంచి 2 టీ స్పూన్లు
* ధనియాల పొడి – 1 టీ స్పూన్
* గరం మసాలా – ½ టీ స్పూన్
* కసూరి మేతి – 1 టీ స్పూన్
* కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరిగినది)
* నెయ్యి – 2 టీ స్పూన్లు
* నూనె – 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు
* ఉప్పు – తగినంత
* నీరు – అవసరానికి తగినంత
* నిమ్మరసం – సర్వింగ్ కోసం.
Also Read
- రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
రాజ్మాను నానబెట్టడం:
ఈ రెసిపీ కోసం ముందుగా అర కప్పు రాజ్మాను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు శుభ్రంగా కడిగి కుక్కర్ లో వేసి.. ఒక కప్పు నీరు, కొద్దిగా పసుపు, ఉప్పు జోడించి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. రాజ్మా మరీ మెత్తగా కాకుండా.. గట్టిగా కాకుండా ఉడికితే రైస్‌లో మంచి టెక్స్చర్ వస్తుంది.
టమాటా-పెరుగు మసాలా:
రాజ్మా ఉడికేలోపు టమాటాలు, పెరుగు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడిని మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్‌గా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమం రాజ్మా రైస్‌కు ప్రత్యేకమైన రుచి, రంగును అందిస్తుంది. పెరుగు వాడటం వల్ల స్వల్పమైన క్రీమీ టెక్స్చర్ కూడా వస్తుంది. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో నూనె వేడి చేసి జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసి తాలింపు సిద్ధం చేయాలి. అనంతరం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ జోడించి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఈ దశలో ఉడికించిన రాజ్మాను వేసి కొన్ని నిమిషాలు రోస్ట్ చేస్తే మసాలా రుచి బాగా పడుతుంది.
బియ్యం, మసాలా కలయికతో మీల్:
తర్వాత టమాటా పేస్ట్‌ను జోడించి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. అలా వచ్చిన తర్వాత కసూరి మేతి, గరం మసాలా వేసి కలపాలి. ముందుగా నానబెట్టిన బియ్యాన్ని నీరు వంపి ఇందులో వేసి రెండు మూడు నిమిషాలు మసాలాతో కలిపి ఉడికించాలి. ఆ తర్వాత మూడు కప్పుల వేడి నీరు, తగినంత ఉప్పు, కొద్దిగా నెయ్యి, కొత్తిమీర జోడించి కుక్కర్ మూత పెట్టాలి. ఇలా మధ్యస్థ మంటపై సుమారు 20 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పూర్తిగా తగ్గాక మూత తీయాలి. అప్పుడు వేడి వేడి రాజ్మా రైస్ సర్వ్ చేసుకోవచ్చు. పైగా కొద్దిగా నిమ్మరసం, నెయ్యి జోడిస్తే రుచి మరింత పెరుగుతుంది.
పూర్తి భోజనానికి బెస్ట్ ఆప్షన్:
ఈ హై ప్రోటీన్ వన్‌పాట్ మీల్‌తో ప్రత్యేకంగా కూరలు లేదా గ్రేవీలు అవసరం ఉండవు. పక్కన కొద్దిగా రైతా లేదా ఉల్లిపాయ ముక్కలు ఉంటే పూర్తి భోజనం సిద్ధమైనట్టే. ఇంట్లో ఎంతమంది ఉన్నా సులభంగా తయారు చేయగలిగే ఈ రాజ్మా రైస్ ఆరోగ్యకరమైన, రుచికరమైన మరియు సమయాన్ని ఆదా చేసే అద్భుతమైన వంటకం.
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!