Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi 17T Launched: స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీలలో ఒకటైన షియోమీ (Xiaomi) భారత మార్కెట్లో కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ షియోమీ 17T (Xiaomi 17T)ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కొత్త మొబైల్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ లెన్స్, 50MP 5x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. లైకా (Leica) Summilux ఆప్టికల్ లెన్స్‌తో ఉన్న ఈ కెమెరా వ్యవస్థ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజషన్) సపోర్ట్‌ను అందిస్తుంది. అలాగే దీనికి AI ఆధారిత 120x Ultra Zoom ఫీచర్‌ను కూడా అందించారు. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఇవ్వగా, ముందు మరియు వెనుక కెమెరాలతో 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఉంది.
ఈ ఫోన్లో 6.59 అంగుళాల 1.5K OLED AMOLED డిస్ప్లేను అందించగా.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్‌తో పాటు గరిష్టంగా 3500 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది. ఈ డిస్ప్లేకు TÜV Rheinland ఇంటెలిజెంట్ ఐ కేర్ సర్టిఫికేషన్ కూడా లభించింది. ఈ కొత్త Xiaomi 17Tలో MediaTek Dimensity 8500-Ultra 4nm ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఫోన్లో 12GB LPDDR5X RAM, 256GB/512GB UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే కొత్తగా పనితీరు తగ్గకుండా ఉండేందుకు Xiaomi 3D IceLoop కూలింగ్ సిస్టమ్‌ను తీసుకవచ్చారు.
Also Read
- Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
- MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
- 144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6500mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందించారు. ఇది ఇదివరకు మోడళ్లతో పోలిస్తే 18% అధిక సామర్థ్యాన్ని కలిగి ఉందని కంపెనీ తెలిపింది. 67W హైపర్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఉండగా.. 50W PPS ఛార్జింగ్ సపోర్ట్‌తో థర్డ్ పార్టీ ఛార్జర్లను కూడా ఉపయోగించవచ్చు. ఇంకా ఇందులో IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఐటమ్స్, Hi-Res ఆడియో, Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFC, IR బ్లాస్టర్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3పై ఈ ఫోన్ పనిచేస్తుంది.

Xiaomi 17T రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 12GB + 256GB వేరియంట్ రూ. 59,999 కాగా, 12GB + 512GB వేరియంట్ రూ. 64,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ జూన్ 10 నుంచి Mi.com, అమెజాన్, షియోమీ రిటైల్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. కొత్త Xiaomi 17T కొనుగోలు చేసే వినియోగదారులకు రూ. 5,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ లేదా క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంతేకాకుండా 18 నెలల వరకు నో కాస్ట్ EMI, జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే స్ఫోటిఫై ప్రీమియం, యూట్యూబ్ ప్రీమియం, గూగుల్ AI ప్రో (5TB క్లౌడ్ స్టోరేజ్‌తో), జియో టీవీ+ వంటి డిజిటల్ సబ్స్క్రిప్షన్లను ఉచితంగా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!