షర్మిల పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మంత్రి రోజా విశాఖలో మాట్లాడుతూ.. షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒక సారి గమనించాలని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని జైలు పాలు చేసిన పార్టీతో చేతులు కల్పి అన్యాయం చేశారన్నారు. షర్మిల గారికి సలహా ఇస్తున్నానని, ఇప్పుడు తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి నుండి మనకి రావాల్సిన 6 వేల కోట్లు అని, ఉమ్మడి ఆంధ్ర హయాంలో ఏపీకి రావాల్సిన లక్ష 80 కోట్ల ఆస్తులు రాబాట్టాలన్నారు. టూర్ లు పెట్టి ప్రచారం చేస్తున్నారని, తెలంగాణలో పోరాటం చేస్తా అని చెప్పి కాంగ్రెస్ లో విలీనం ఎందుకు చేసిందో షర్మిల చెప్పాలన్నారు మంత్రి రోజా.
Daggubati Purandeswari : బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టాం
ఏపీలో ఏ లబ్ది పొందడానికి కాంగ్రెస్ తరుపున ప్రచారం చేస్తున్నారో షర్మిల చెప్పాలని, రాజశేఖర్ రెడ్డి గారు బతికి ఉంటే కాంగ్రెస్ మీద ఉమ్మేసి వాళ్ళు అని చెప్పి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్ లో మళ్ళీ జాయిన్ అయ్యారో చెప్పాలని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. గట్స్ ఉన్న నాయకుడు జగన్. చంద్రబాబు, లోకేశ్, టీడీపీని జాకీలు పెట్టి లేపినా జాకీలు విరిగిపోతున్నాయి. వయసులో చిన్నవాడైన అమిత్ షా కాళ్లను చంద్రబాబు పట్టుకోవడం సిగ్గుచేటు. బాబు మా చిత్తూరు జిల్లాలో పుట్టడం సిగ్గుచేటు. అని మంత్రి దుయ్యబట్టారు. అధికారంలోకి రావాలన్న కాంక్షతో కాంగ్రెస్‌తో ఒకసారి, బీజేపీతో ఒకసారి పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పొలిటికల్‌గా రోజురోజుకు దిగజారిపోతున్నారని అన్నారు.
Rent Agreement : రెంట్ అగ్రిమెంట్ కేవలం 11 నెలలకే ఎందుకో తెలుసా ?