Vundavalli Arun Kumar: సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. తన రాజకీయ భవిష్యత్‌పై కీలక ప్రకటన చేశారు.. విజయవాడలో జరిగిన మూడు దారులు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జయప్రకాశ్ నారాయణ్, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, దేవులపల్లి అమర్, ఆర్.వి.రామారావు తదితరులతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు గనుక రాజమండ్రి వచ్చి వైఎస్ షర్మిల మా ఇంటికి వచ్చిందన్నారు.. బీజేపీకి షర్మిల చెప్పిన నిర్వచనం బాబు, జగన్, పవన్.. బాగుందన్నారు. అయితే, నేను రాజకీయం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ (వీఆర్ఎస్) తీసుకున్నానని ప్రకటించారు.. ఇక, యాంటీ మోడీ ఓటింగ్ ఇండియా కూటమి కి ప్రభావం చూపిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెబుతున్న సమస్య పెద్ద విబేధం ఏం చూపదన్నారు.. నేనేమీ పెద్ద కష్టాలు చూస్తాను అనుకోవడం లేదని చమత్కరించారు ఉండవల్లి..
Read Also: Swami Paripoornananda: అధిష్టానం ఆదేశిస్తే హిందూపురం నుంచి పోటీ.. స్వామి పరిపూర్ణానంద ప్రకటన
ఇక, వైఎస్ రాజశేఖరరెడ్డి చాలా జాగ్రత్తగా ఉండేవారు.. మనవాళ్లు అనే భావన అందరికి ఇచ్చారు రాజశేఖరరెడ్డి అని గుర్తుచేసుకున్నారు ఉండవల్లి.. రాజకీయంలోకి రావడానికి కారణం వేరు.. ఇక్కడికొచ్చాక మారిపోతున్నాయి అన్నారు. స్వార్ధం లేని వాడు కూడా రాజకీయాల్లో స్వార్ధ పూరితంగా మారిపోతారని వ్యాఖ్యానించారు.. రాజకీయ నాయకుడు టంగుటూరి ప్రకాశం పంతులు లాగా ఉండాలి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 1952 ముందు రాజకీయాల్లో సంపాదించుకున్న వాళ్లు లేరు.. 1952 ముందు రాజకీయం ఒక వ్యసనంగా పేర్కొన్నారు. ఎదుటి వ్యక్తి చూసే చూపులో ఆశ్చర్యం కోసం రాజకీయాల్లోకి వచ్చేవారని తెలిపారు. దేవులపల్లి అమర్ కి రాజశేఖరరెడ్డి అంటే లవ్వు.. జగన్ అంటే పిచ్చ.. అందుకే చంద్రబాబు అంటే పడదు అని చెప్పుకొచ్చారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్.