Ushasri Charan: తెలుగుదేశం పార్టీ-జనసేన పొత్తు వ్యవహారంలో జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. అయితే, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పొత్తుపై మంత్రి ఉషశ్రీ చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. సొంత మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును పవన్ కల్యాణ్ ఎలా నమ్మాడు..? అని ప్రశ్నించారు. పవన్ ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు నిజస్వరూపాన్ని తెలుసుకుంటున్నాడన్న ఆమె.. పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ఇంకా సినిమా చాలా ఉందని కౌంటర్ ఇచ్చారు. పవన్ ఓటు బ్యాంకును వాడుకొని చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు అని విమర్శించారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ జాగ్రత్త పడితే మంచిదని పేర్కొన్నారు. ఇక, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కూడా మండిపడ్డారు ఉషశ్రీ చరణ్.. వైఎస్ కేవలం చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ మాత్రమే చదువుతోందని ఆరోపించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కూడా ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.. ఆ పార్టీలో వైఎస్ షర్మిల ఎలా పనిచేస్తోంది? అని నిలదీశారు ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ . కాగా, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్ది.. రాజకీయ నేతలు విమర్శలు, ఆరోపణలు ఎక్కుపెట్టి పొలిటికల్ హీట్ పెంచుతోన్న విషయం విదితమే.
Read Also: Top Headlines @ 5 PM : టాప్ న్యూస్