కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిరకాల కోరిక అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. వైఎస్ఆర్ తన కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తప్పకుండా ప్రధాని అవుతారని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. నేడు వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి మహేష్ కుమార్ గౌడ్…
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగించడంతో నందిగామలో ఉద్రిక్తత వాతావరణానికి కారణం అయ్యింది.. ట్రాఫిక్‌కు అడ్డుగా ఉందని రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి సమయంలో తొలగించారు మున్సిపల్ అధికారులు... గాంధీ సెంటర్ లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం తొలగించిన ప్రదేశంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దేవినేని అవినాష్, గౌతమ్, రెడ్డి, మొండితోక జగన్ మోహన్ రావు ఆందోళనకు దిగారు..
దేవా కట్ట దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ వెబ్ సిరీస్ మయసభ ఆగస్టు 7న సోనీ లివ్ ద్వారా ప్రసారం కానుంది. ఈ సిరీస్‌లో నాయుడు – రెడ్డి పాత్రల స్నేహం, వారిద్దరి మధ్య నెలకొన్న రాజకీయ విరోధాలు కథా ప్రధానాంశమని ఇప్పటికే దాదాపు క్లారిటీ వచ్చేసింది. అయితే ఆ సమయంలో వారిద్దరూ కాంగ్రెస్‌లో కలిసి మంత్రులుగా సేవలందించిన కాలాన్ని ఈ సిరీస్ స్పృశించనుందన్న అంచనాలున్నాయి. ఇక్కడ పేర్లు ప్రస్తావించడం లేదు కానీ దాదాపుగా చంద్రబాబు రాజశేఖరరెడ్డి ఇద్దరి…
YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘ఫాదర్స్ డే’ సందర్భంగా తన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని భావోద్వేగంతో స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ (X) వేదికగా ఓ ప్రత్యేక పోస్ట్ చేశారు. “మీరు ఎప్పుడూ నాకు స్ఫూర్తి, నాకు నా ప్రతి అడుగులో నువ్వే నా స్ఫూర్తి.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న” అంటూ వైఎస్సార్ ఫోటోను జత చేశారు. Read Also:…
Air Crash: అహ్మదాబాద్ ఎయిరిండియా దుర్ఘటనలో విమానంలోని 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా మరణించారు. దీంతో గుజరాత్ బీజేపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. అయితే, విజయ్ రూపానీలాగే గతంలో కూడా భారత రాజకీయ ప్రముఖులు విమాన ప్రమాదాల్లో మరణించారు.
సొంత జిల్లాలో మూడు రోజుల పర్యటనకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తన రెండో రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం ఇడుపులపాయలోని దివంగత నేత వైఎస్సార్ ఘాట్‌కు వెళ్లారు.. మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించారు సీఎం వైఎస్ జగన్, ఇతర కుటుంబ సభ్యులు, పలువురు వైసీపీ నేతలు.
తన సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్నర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇవాళ ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.. మూడు రోజులపాటు జిల్లా పర్యటనలో భాగంగా నిన్న ఇడుపులపాయకు చేరుకున్నారు. నిన్న కడప, కమలాపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముగించుకుని ఇడుపులపాయకు వెళ్లిన సీఎం.. ఇవాళ ఉదయం వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.. అనంతరం వైఎస్ విగ్రహానికి పూల మాల వేసి…
YS Vijayamma Consoles Krishnam raju Wife: కృష్ణంరాజు భార్యకు విజయమ్మ పరామర్శ మాజీ కేంద్రమంత్రి, రెబల్స్టార్ కృష్ణంరాజుకు వైఎస్ విజయమ్మ నివాళులర్పించారు. జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటికెళ్లి సతీమణి శ్యామల, కూతుళ్లతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణంరాజు, దివంగత సీఎం వైఎస్సార్ మధ్య అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరనే వార్త అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని…