దేవా కట్ట దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ వెబ్ సిరీస్ మయసభ ఆగస్టు 7న సోనీ లివ్ ద్వారా ప్రసారం కానుంది. ఈ సిరీస్‌లో నాయుడు – రెడ్డి పాత్రల స్నేహం, వారిద్దరి మధ్య నెలకొన్న రాజకీయ విరోధాలు కథా ప్రధానాంశమని ఇప్పటికే దాదాపు క్లారిటీ వచ్చేసింది. అయితే ఆ సమయంలో వారిద్దరూ కాంగ్రెస్‌లో కలిసి మంత్రులుగా సేవలందించిన కాలాన్ని ఈ సిరీస్ స్పృశించనుందన్న అంచనాలున్నాయి.
ఇక్కడ పేర్లు ప్రస్తావించడం లేదు కానీ దాదాపుగా చంద్రబాబు రాజశేఖరరెడ్డి ఇద్దరి పాత్రలను ఆధారంగా చేసుకుని ఈ సిరీస్ రూపొందించారని దాదాపుగా అందరికీ తెలుసు. ఈ సిరీస్లో చంద్రబాబుని పోలింగ్ ఉండే పాత్రలో ఆది పినిశెట్టి రాజశేఖర్ రెడ్డిని పోలి ఉండే పాత్రలో చేతిని రావు నటిస్తున్నారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తరువాత, చంద్రబాబు టిడిపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన వైఎస్సార్ తో రాజకీయం పరంగా విభేదాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో రాయలసీమ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన పరిటాల రవి తెరపైకి వచ్చారు. మొదట నక్సలైట్, ఆ తర్వాత ఫ్యాక్షన్ లీడర్‌గా, చివరికి రాజకీయ నాయకుడిగా పరిటాల రవి చేసిన ప్రయాణం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమే కాదు ఆధునిక రాజకీయ చరిత్రలో ముఖ్యమైన అధ్యాయంగా నిలిచింది.
అటు రామారావు గారి నమ్మకస్తుడిగా, ఇటు రాయలసీమలో టిడిపి బలాన్ని పెంచిన నేతగా పరిటాల రవి పాత్ర, మయసభ వంటి సీరియస్ పొలిటికల్ డ్రామాలో ఉంటుందా ? లేదా? అన్న సందేహాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ఆయన పాత్ర ఉంటే, ఆ పాత్రను ఎవరు పోషించారు? పరిటాల రవిని తెరపై చూపే హస్తినపురపు రాజకీయ ఒడిదొడుకులు ఎలా ఉండబోతున్నాయి?.
Also Read: Sri Sathyasai District: ఉదయం పెళ్లి, రాత్రికి ఫస్ట్ నైట్.. అంతలోనే నవవధువు ఆత్మహత్య!
ఈ మయసభ నిర్మాతలలో ఒకరైన హర్ష పరిటాల రవికి స్వయానా అల్లుడు పరిటాల రవి కుమార్తె స్నేహను హర్ష వివాహం చేసుకున్నాడు. పరిటాల రవికి స్వయాన సోదరి కుమారుడే అయిన హర్ష ప్రస్తుతం పలు వ్యాపారాలు చేస్తున్నారు. స్వయంగా పరిటాల రవి అల్లుడే నిర్మాతలలో ఒకరు కావడంతో ఆయన పాత్ర కచ్చితంగా ఉండే అవకాశం ఉంది.
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మాత్రం… ఆగస్టు 7న సోనీ లివ్ మయసభ స్ట్రీమింగ్ అయిన తరువాతే తెలుస్తుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది, ఈ సిరీస్ తాలూకు పాత్రలు, పాత్రల పునర్నిర్మాణం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసే అవకాశముంది.