తెలంగాణలో పాదయాత్రల పరంపర మొదలైంది.. ఇప్పటికే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తొలి విడత పాదయాత్ర ముగియగా.. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ కూడా పాదయాత్ర చేశారు. ఇప్పుడు మరో మహా పాదయాత్రకు రంగం సిద్ధమైంది. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేవెళ్ల నుంచి ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో పాదయాత్ర ప్రారంభించనున్నారు. నేటినుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభం కానుంది. తండ్రి సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ… చేవెళ్ల నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. 90 నియోజకవర్గాల మీదుగా 400…
వైఎస్ విజయమ్మ నేతృత్వంలో నిన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్మరణ సభ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సంస్మరణ సభకు తెలంగాణ మరియు ఏపీ నుంచి కీలక రాజకీయ నేతలు వచ్చారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినేట్ లో పనిచేసిన మంత్రులు ఈ సభకు హజరయ్యారు. ఇందులో భాగంగానే… కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… సంచలన వ్యాఖ్యలు చేశారు.…
వైఎస్ జగన్.. వైఎస్ షర్మిల. అన్నా చెల్లెళ్లు. అన్న.. ఆంధ్రను ఇప్పటికే ఏలుతున్నారు. చెల్లెలు తెలంగాణ వేదికగా రాజకీయం వేడిగా ప్రారంభించారు. ప్రతి మంగళవారం చెప్పినట్టుగా నిరుద్యోగుల తరఫున పోరాట దీక్ష చేస్తున్నారు. కడుపు మాడ్చుకుని మరీ.. దీక్షలతో వార్తలతో చోటు పొందుతున్నారు. విమర్శల ధాటి పెంచుతున్నారు. ఈ క్రమంలో.. జగన్ తీరుపై చాలా మందికి ఎప్పుడో స్పష్టత వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో తప్ప.. పొరుగున ఉన్న తెలంగాణలో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని.. ఆయన క్యాంప్…
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నామస్మరణతో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. వైఎస్ఆర్ మావాడంటే.. మావాడంటూ నేతలు పోటీపడుతున్నారు. ఇదికాస్తా శృతిమించుతుండటంతో అందరిబంధువైన వైఎస్ఆర్ ఇప్పుడు కొందరివాడుగా మిగిలిపోతున్నాడు. నిన్న హైదరాబాద్లో వైఎస్ విజయమ్మ నిర్వహించిన వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనంగా సాక్షిగా ఈ విషయం రుజువైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనందరినీ విడిచి 12ఏళ్లు గడుస్తుంది. నిన్ననే ఆయన 12వర్ధంతిని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు నిరాడంబరంగా జరుపుకున్నారు. ఇడుపుపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్…
సెప్టెంబర్ 2 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. ఈ సందర్బంగా ఆ నేతను పార్టీ నాయకులు, అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. 2004 మే నెలలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్.. 2009 లోను రెండోసారి అధికారంలోకి వచ్చారు. రూ.2కే కిలో బియ్యం, రైతులకు ఉచిత విద్యుత్, 108 అంబులెన్స్ సర్వీసులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ట్రిపుల్ ఐటీల ఏర్పాటు సహా ఎన్నో ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇలా తన ప్రజారంజక పాలనతో ప్రత్యేక…
2009 సెప్టెంబర్ 2… ఆ రోజు ఏపీ సీఎం వైఎస్‌ఆర్ సెక్రటేరియట్‌లో లేరు. అయినా సి బ్లాక్ అంతా హడావుడి. అంతా ఒకటే టెన్షన్ టెన్షన్…సీఎం ఆఫీస్‌లో లేకపోతే అక్కడ ఏ సందడీ ఉండదు..కానీ ఆ రోజు అందుకు భిన్నం. ఆ రోజు చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి సీఎం వైఎస్ఆర్. అందుకే ఉదయం సరిగ్గా సరిగ్గా 8 గంటల 38 నిమిషాలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ ఎగిరింది. 10.30 కల్లా చిత్తూరు చేరాలి.…
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్‌లో వైఎస్ చిత్రపటానికి నివాళులుర్పించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. వైఎస్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనేదే వైఎస్సార్ ఆకాంక్ష అని తెలిపిన రేవంత్… వైఎస్సార్ ఆకాంక్ష నెరవేర్చే దిశగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు.. ఇక, కృష్ణా నది జలాల పంపకం విషయంలో వివాదాలపై స్పందించిన రేవంత్.. ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీ నీళ్లు…