ఏపీ సీఎం వైఎస్ జగన్ అభ్యర్ధుల ఎంపిక మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. దీంతో నాలుగవ జాబితాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే నాలుగవ జాబితా కోసం వైసీపీ అధినాయకత్వం తుది కసరత్తు ప్రారంభించింది.
Manifesto will be released soon Says Chandrababu: సంక్షేమ పథకాలకు నాంది పలికింది టీడీపీ అని, సీఎం జగన్ పాలనలో వంద పథకాలను రద్దు చేశారని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరిట సూపర్ సిక్స్ అందిస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం వచ్చాక యువతకు ఉద్యోగాలు, మహాలక్ష్మి పథకం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు తెలిపారు. టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో త్వరలో…
టమోటోకి, పొటాటోకి తేడా తెలియని సీఎం జగన్ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. సీఎం జగన్ రివర్స్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందన్నారు. దుర్మార్గుడు పాలిస్తే రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతిందని మండిపడ్డారు. అప్పుల్లో రాష్ట్ర రైతులు అగ్రస్థానంలో ఉన్నారని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ‘రా.. కదిలిరా’ అని పిలుపునిస్తున్నా అని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు సభలో చంద్రబాబు…
దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలను నిజం చేయటానికి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ అన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కొన్ని పార్టీల్లో భయం పట్టుకుందని విమర్శించారు. వైసీపీలో 2019కి ముందు రాజశేఖర్ రెడ్డి బొమ్మ ఎక్కడ ఉంది?, ఇప్పుడు ఎక్కడ పెట్టారు అని ప్రశ్నించారు. వైసీపీ మోసపూరిత వైఖరి నచ్చకనే షర్మిల ఆ పార్టీకి దూరమయ్యారని మస్తాన్ వలీ…
కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఇలా ఎన్ని పార్టీలు వచ్చినా మేం, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే నడుస్తాం అన్నారు మంత్రి పెద్దిరెడ్డి.. కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం సోనియా గాంధీ, చంద్రబాబుది అంటూ మండిపడ్డారు.. వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్న ఆయన.. మా కాళ్లను మేం నరుక్కోం.. కాంగ్రెస్ పార్టలో ఎవరు ఉన్నా రాజకీయ ప్రత్యర్ధిగానే చూస్తాం అన్నారు.
ఎన్నికల వేళ టీడీపీ- జనసేన మళ్లీ కుట్రలకు తెరతీస్తారని సీఎం జగన్ పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజలను అడ్డగోలుగా మోసం చేశారన్నారు.