ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం ఘటనపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) నేతలు ఆదివారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మల్లాది విష్ణు, ఇతర పార్టీ నేతలతో కూడిన ప్రతినిధి బృందం ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనాను కలిసి తమ ఫిర్యాదులను స్వీకరించింది. ముఖ్యమంత్రిపై దాడి వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపించిన వైఎస్ఆర్సిపి నేతలు, ఎన్నికల సంఘాన్ని సమగ్రంగా విచారించాలని కోరారు. సమావేశం…
కడప జిల్లాలోని పులివెందులలో వైసిపి బలిజ సంఘీయుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేనేంటో నా మనస్తత్వం ఏంటో ఇక్కడ ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు. గడిచిన మూడేళ్లుగా ఇబ్బంది పెట్టాలని చూస్తూనే ఉన్నారు.. అయినా చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో ప్రజలతోనే ఉన్నాను అని ఆయన చెప్పారు.
మేమంత సిద్ధం సభ జనసముద్రంగా మారిందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సిద్ధం సిద్ధం అంటూ ప్రజల నినాదాలు వైసీసీ జైత్రయాత్రకు శంఖారావంలా వినిపిస్తున్నాయి.. ప్రజలు చేస్తున్న సిద్ధం సిద్ధం అనే నినాదం ప్రతిపక్షాలకు యుద్ధం యుద్ధం అన్నట్లు ఉంది.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ.. ఇటీవలే రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్.. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇక్బాల్‌కు పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు..
మేమంతా సిద్ధం 12వ రోజు రేపటి (ఏప్రిల్ 10) షెడ్యూల్‌ను వైసీపీ ఇవాళ (మంగళవారం) విడుదల చేసింది. ఈ యాత్రలో భాగంగా వైసీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం రాత్రి బస నుంచి బయలుదేరనున్నారు.
Gangadhara Nellore TDP Leader A Harikrishna Joins in YCP: చిత్తూరులో ఏడోరోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగుతోంది. ఈరోజు అమ్మగారిపల్లి నుంచి సీఎం వైఎస్ జగన్ బయల్దేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బస్సు యాత్రలో కుప్పం నియోజకవర్గం టీడీపీ నుంచి కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అమ్మగారిపల్లె స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి…
నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సుయాత్రలో భాగంగా ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు అని తెలిపారు. అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నాం.. ప్రభుత్వ పథకాలతో ఎర్రగుంట్లలో 93 శాతం మంది లబ్ది పొందారు.