Peddireddy Ramachandra Reddy: టీడీపీ అధినేత చంద్రబాబును మరోసారి టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గానికే ఏమీ చేయలేని చంద్రబాబు జిల్లాకు ఏమి చేసి ఉంటారు..? అని ప్రశ్నించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు తన సొంత నియోజకవర్గానికి నీరు అందించలేకపోయారు.. కుప్పం కే ఏమి చేయలేని చంద్రబాబు జిల్లాకు ఏమి చేసి ఉంటారు ? అని మండిపడ్డారు. అయన ఎలాంటి అభివృద్ధి చేయలేదు అని ప్రజలకు తెలుసన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్ కుప్పంకు నీరు అందించాలన్న ధృఢనిశ్చయంతో పని చేశారని తెలిపారు. ఇప్పటికే హంద్రీనీవా నీరు కుప్పం నియోజవర్గంలోకి వచ్చాయి.. వచ్చే ఏడాదిలో కుప్పం ప్రజలకు పుష్కలంగా నీరు అందుతుందని పేర్కొన్నారు. ఇక, తెలుగుదేశం పార్టీ వారు అన్నా క్యాంటీన్ అని చెప్పి ట్రాక్టర్ లో తీసుకొచ్చి పది మందికి భోజనం పెట్టారు.. అలాంటి క్యాంటీన్ లు ఎన్ని ఉన్నా ఒక్కటే లేకున్న ఒక్కటే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అయితే, మేం రాజన్న క్యాంటీన్ పేరుతో ఎంత మంది వచ్చిన, వారందరికీ మంచి భోజనం అందిస్తున్నాం అని వెల్లడించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Read Also: MP Vijayasai Reddy: వైసీపీకి అందరూ సమానమే.. కేంద్రం సహకారం కోసమే కొన్ని బిల్లులకు మద్దతు..!