ఎన్నికలు జరగకముందే సీఎం జగన్ జగన్మోహన్ రెడ్డి ఓటమిని అంగీకరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామక్రిష్ణ అన్నారు. 82 మంది ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఎందుకు వచ్చిందో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కంటే జగన్ పెద్ద నియంత అని, వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఓడిపోతారని రామక్రిష్ణ పేర్కొన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టులో గేటు కొట్టుపోతే మరమ్మతులు చేయలేని అసమర్ధ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది అని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ…
రాష్ట్రంలో బీసీలు బాగుపడితే సీఎం వైఎస్ జగన్కు కడుపు మంట అని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్ విమర్శించారు. రాష్ట్రంలో జగన్ ఆధ్వర్యంలో సిగ్గుమాలిన యాత్ర జరుగుతోందిని.. దళితులను, బీసీలను అవమానించే యాత్ర జరుగుతుందన్నారు. జగన్ అరాచకాలు, దోపిడీ, అత్యాచారంపై ప్రశ్నించిన మహిళా నేతలపై అసబ్యకరంగా పోస్టులు పెట్టించారని రవికుమార్ మండిపడ్డారు. రాష్ట్రంలో పేరుకే బీసీ మంత్రులు ఉన్నా పెత్తనం అంతా రెడ్లదే అని పేర్కొన్నారు. శ్రీకాకుళంలో కూన రవికుమార్ మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి ఆర్కె రోజా మండిపడ్డారు. చంద్రబాబు పురాతన దేవాలయాలు కూల్చి బాత్రూంలు కట్టాడని, దేవాలయాలు అన్నింటినీ సీఎం జగన్ పునరుద్ధరిస్తున్నారన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద భవానీ ఐల్యాండ్లో ఆదివారం కార్తీక మహోత్సవం నిర్వహించారు. కార్తీక మహోత్సవంలో భాగంగా శివపార్వతుల కళ్యాణం జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కె రోజా పాల్గొన్నారు. Also Read: Vellampalli Srinivasa Rao: టీడీపీ ఆపీస్కు…
ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూర్ సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ చౌదరి డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎటువంటి సాక్షాదారులు లేకుండా కేసులు నమోదు చేసి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి సీఐడీలను ప్రయోగించి ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు.. తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు.