గత ఎన్నికలలోల్లో రైతులకు ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్ నిలబెట్టకున్నారు అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఐదేళ్ల పాటూ రైతులకు రైతు భరోసాను చెప్పినదానికంటే అధికంగా ఇచ్చారన్నారు. ఐదేళ్లలో రైతులకు ప్రభుత్వం అందించిన సేవలపై పుస్తకాన్ని విడుదల చేశాం అని ఆయన తెలిపారు. రైతులపై భీమా ప్రీమియం భారం పడకుండా ప్రభుత్వమే చెల్లించిందని, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చేశామని మంత్రి కాకాణి చెప్పారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంటే వరి ధాన్యానికి మద్దతు ధర కంటే 30 శాతం అధికంగా ఇచ్చామని చెప్పుకొచ్చారు.
నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… ‘ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టకున్నారు. వరుసగా ఐదేళ్ల పాటూ రైతులకు రైతు భరోసాను చెప్పినదానికంటే అధికంగా ఇచ్చారు. పీఎం కిసాన్, రైతు భరోసాను సున్నా వడ్డీకి అందించారు. ఐదేళ్లలో రైతులకు ప్రభుత్వం అందించిన సేవలపై పుస్తకాన్ని విడుదల చేశాం. రైతులపై భీమా ప్రీమియం భారం పడకుండా ప్రభుత్వమే చెల్లించింది. ధాన్యం కొనుగోళ్ల లో రైతులకు ఇబ్బందులు లేకుండా చేశాం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంటే వరి ధాన్యానికి మద్దతు ధర కంటే 30 శాతం అధికంగా ఇచ్చాం. ఉచిత విద్యుత్ కు సంబందించిన బకాయిలను చంద్రబాబు ఇవ్వలేదు. జగన్ వచ్చిన తర్వాతే బకాయిలను చెల్లించాం’ అని అన్నారు.
Also Read: Mudragada Padmanabham: 80 అసెంబ్లీ సీట్లు, సీఎం పదవి అడగాల్సింది.. పవన్ కళ్యాణ్‌కు ముద్రగడ లేఖ!
‘రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని మేం గర్వంగా చెబుతున్నాం. రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కోటయ్య కమిటీని వేశారు. ఆ కమిటీ సిఫార్సులను కూడా అమలు చేయలేదు. సంపూర్ణ రుణ మాఫీ చేయకుండా ఐదు విడతల్లో కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. చంద్రబాబు విధానాల వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగింది’ అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు.