YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన.. వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. సూపర్ సిక్స్ మోసాలు, రైతులు పడుతున్న అవస్థలు, పార్టీ శ్రేణులపై కూటమి సర్కార్ వేధింపులు, మెడికల్ కాలేజీల వ్యవహారం ఇలా పలు అంశాలపై పార్టీ నేతలు, కేడర్‌కు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి రీజనల్ కో-ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ…
YS Jagan Digital Book: ‘డిజిటల్ బుక్’ పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎలాంటి అన్యాయం జరిగిన అప్లోడ్ చేయండి అని పిలుపునిచ్చారు.. Digitalbook.weysrcp.com పేరుతో పోర్టల్ లాంచ్ చేశారు జగన్.. అన్యాయం మరియు రాజకీయ బాధితులను ఎదుర్కొన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరియు నాయకులకు అండగా నిలిచేందుకు.. ప్రత్యేక పోర్టల్ తెస్తామంటూ గత కొంతకాలంగా చెబుతూ వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈరోజు పార్టీ…
Minister Gottipati Ravi Kumar: జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలే.. కానీ, న్యాయస్థానం ఇచ్చేది కాదు అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.. అవినీతి కేసుల్లో జైలుకెళ్లి బయటకు వచ్చి నేటికి 12 సంవత్సరాలు అయినందుకు వైఎస్ జగన్ విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్నట్లున్నారు అంటూ ఎద్దేవా చేశారు.. నాటి అవినీతి కుంభకోణాల్లో జైలుకెళ్లి వచ్చినందుకు బహుశా వేడుకలు చేసుకుంటాడేమో? అని సెటైర్లు వేశారు.. జగన్ ఐదేళ్లు విధ్వంసం చేయకుండా ఉంటే అమరావతిలో ఈపాటికి సకల…
తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన స్పీకర్ రూలింగ్ చట్టవిరుద్ధమైందిగా ప్రకటించాలని పిటిషన్ లో హైకోర్టును కోరారు జగన్.. ఈ రూలింగ్ రద్దు చేయాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు.. ఈ రూలింగ్ ఏపీ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్ క్వాలిఫికేషన్ చట్టంలో సెక్షన్ 12బీ కి విరుద్ధమని ప్రకటించాలని హైకోర్టును కోరారు జగన్.
వైసీపీ లీడర్లు... కేడర్ తో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక సమావేశానికి సిద్ధమయ్యారు.. తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కేంద్రంగా ఎమ్మెల్సీలు మినహా అందరితో కలసి ఓ జంబో మీటింగ్ అరేంజ్ చేశారు జగన్.. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు.. మెడికల్ కళాశాలల ప్రవేటీకరణపై వైసీపీ ఆందోళనల నడుమ ముఖ్య నేతలందరితో జగన్ ఏర్పాటు చేసిన కీలక సమావేశం పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా…
జుబీన్ గార్గ్ అంత్యక్రియలు పూర్తి.. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. గౌహతిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు జరుగుతుంటుండగా భార్య గరిమా సైకియా గార్గ్ ఏడుస్తూనే కనిపించారు. అస్సామీ మహిళలు ధరించే సాంప్రదాయ దుస్తులైన మేఖేలా చాదర్ ధరించారు. చితికి మంటలు అంటుకుంటున్న సమయంలో రెండు చేతులు జోడించారు. ఎక్కి.. ఎక్కి ఏడుస్తూనే కనిపించారు. పలువురు ఆమెను ఓదార్చుతూ కనిపించారు. మరో సౌత్ దర్శకుడి రెండేళ్లు టైం…
వ్యవసాయం అంటే ఏమాత్రం ఇష్టం లేని వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని మాజీమంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి విమర్శించారు. రైతుల కష్టాలు తీర్చటానికి కూటమి ప్రభుత్వం ముందుకు రాలేదని, చంద్రబాబు పుణ్యమా అని రైతులు తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయారన్నారు. యూరియా కోసం రైతులు పడే అగచాట్లు ఈ ప్రభుత్వ పెద్దలకు కనపడటం లేదా? అని ప్రశ్నించారు. గతంలో కంటే ఎక్కువ తెచ్చామని చెప్తున్న యూరియా ఏమైంది?, రైతులకు అందాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్లోకి ఎలా…
108 అంబులెన్స్ రాక శిశువు మృతి చెందటంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘కుయ్ కుయ్ మూగబోతోంది.. ప్రజల ప్రాణాలు పోతున్నాయి’ అని కూటమి ప్రభుత్వంపై జగన్ మండిపడ్డారు. ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు ప్రభుత్వం ఉరివేస్తోందని ఫైర్ అయ్యారు. పాడేరు సమీపంలోని ముల్లుమెట్టకు చెందిన నిండు గర్భిణీని ఆస్పత్రికి తరలించేందుకు 108 వాహనం రాకపోవడంతో.. ఆమె ఆటోలోనే ప్రసవించింది. వైద్యం అందక శిశువు ఆటోలోనే కన్నుమూసింది.…
Off The Record: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పుకుంటున్నారు. ఒకవైపు అధికారంలో ఉన్న టీడీపీ దూకుడు పెంచుతుంటే… ప్రతిపక్షం మాత్రం తట్టుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతోందట. అలా ఎందుకంటే… పార్టీలో గ్రూపు రాజకీయలేనన్నది కేడర్ సమాధానం. నేతలు తలో దిక్కులా ఉంటే….కార్యకర్తలు దిక్కులు చూస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్గా మాజీ ఎంపీ బుట్టా రేణుక ఉన్నారు. అటు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వయసు రీత్యా అంత చురుగ్గా…
ఈ నెల 24వ తేదీన కీలక సమావేశానికి సిద్ధమయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ సమీక్షా సమావేశం జరగనుంది.. సమావేశానికి వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు హాజరుకానున్నారు..