Kakani Govardhan Reddy: తుఫాన్ నష్టాలపై మాజీ సీఎం జగన్ జిల్లా అధ్యక్షులు, రైతు నేతలతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష చేశారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ శాఖ గురించి మంత్రి అచ్చెన్నాయుడు పట్టించుకోవడమే మానేశారు.. రైతుల గురించి పట్టించుకోకుండా తండ్రి కొడుకులు ఇద్దరూ విదేశాలకు వెళ్ళిపోయారు.. అచ్చెన్నాయుడు వీధి రౌడీలగా మాట్లాడుతున్నారు.. ఆయన చేసిన సవాల్ కి మేము సిద్ధంగా ఉన్నామన్నారు. అచ్చెన్నాయుడుకి బుద్ధి, సిగ్గు ఉందా..? దమ్ము లేనప్పుడు సవాల్ విసరడం దీనికి.. అన్ని రంగాల మీద చర్చ పెట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.. కూటమి పార్టీలే మంత్రులను విమర్శిస్తున్నారు.. వెళ్ళి పవన్ కాళ్ళు పట్టుకుంటున్నారు.. అసెంబ్లీని చూసి ప్రజలు అసహ్యించుకున్నారని కాకాణి గోవర్థన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Ravi Kishan: బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు బెదిరింపులు.. భయపడేదిలేదన్న నటుడు
అయితే, అచ్చెన్నాయుడికి ధైర్యం ఉంటే సమస్యలపై చర్చించేందుకు ప్రజల్లోకి వెళ్దామని మాజీ మంత్రి కాకాణి అన్నారు. నష్టపోయిన పంటల గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు..? అని ప్రశ్నించారు. రైతులకు అండగా నిలవాలని జగన్ ప్రయత్నిస్తుంటే.. దాని మీద కూడా విమర్శలా?.. రైతులు తరిమి కొడతారన్నే భయంతోనే మంత్రి అచ్చెన్నాయుడు మిర్చి యార్డుకు పోలేదని పేర్కొన్నారు. ధరల స్థిరీకరణ నిధి మీద అచ్చనాయుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు.. మనిషి పెరిగాడు కానీ బుర్ర పెరగలేదని, ఆయనో కమెడియన్ అని రైతులు నవ్వుకుంటున్నారని గోవర్థన్ రెడ్డి విమర్శించారు.