మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఉత్కంఠ రేపుతోంది. శ్రీవారి దర్శనార్థం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారాయన. అనంతరం రోడ్డు మార్గాన తిరుమల పయనమవుతారు. రాత్రి 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. రేపు ఉదయం పదిన్నరకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. జగన్ కు ఘన స్వాగతం పలకడానికి వైసీపీ శ్రేణులు సిద్దమవుతున్నారు.
"మాజీ ముఖ్యమంత్రి జగన్ దేవుడి జోలికి వెళ్తే ఏమైందో గత ఎన్నికల్లో మీరంతా చూశారు. మనం ఏమతానికి చెందిన వారమైనా అన్నిమతాలను గౌరవించాలి. మేం చర్చి, మసీదులకు వెళ్లినపుడు వారి మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటాం. తిరుమల వెళ్తానంటున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చే సాంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుందని" రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రెడ్ బుక్ పని ప్రారంభమైంది..తప్పుచేసిన వారిని వదలమన్నారు.
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు వైసీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా.. తాను జనసేనలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తన అభిమానులకు సూచించారు..
తిరుమల వ్యవహరం జగన్కు ఓ పొలిటికల్ ఈవెంట్ అని.. కానీ మాకు ఇది సెంటిమెంట్ అని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే జగన్ ఈ నెల 28వ తేదీన పూజలు చేయాలని పిలుపునిచ్చారని పేర్కొన్నారు. జగన్ చేసిన పాపాలు ఇక చాలు అంటూ వ్యాఖ్యానించారు.
వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు అందరు కూడా జనసేనకి, టీడీపీలోకి చేరుకుంటున్నారు.. మీరు ఏకాకి గా మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు గంటా శ్రీనివాసరావు..
మనం అందరం ఉండి కూడా భగవంతుడికి ఇలా అపరాధం జరిగిందనే బాధ.. అందుకే భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలి.. ఇక భగవంతుడే చూసుకుంటాడు అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం కాకరేపుతోనున్న వేళ.. ట్విట్టర్ (ఎక్స్)లో స్పందించిన ఆయన.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేవుడిని దర్శించుకోవచ్చు. అయితే, ఆయనకు వేంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యం. నమ్మకం…
ప్రపంచ వ్యాప్తంగా తిరుమలకు ఎంతో విశిష్టత ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ పాలకులెవ్వరూ తిరుమల పవిత్రత దెబ్బతీసే సాహసం చేయలేదన్నారు. ఎందరికో స్పూర్తిదాయకమైన పవిత్ర క్షేత్రంలో 5ఏళ్లుగా అపవిత్ర కార్యక్రమాలు చేపట్టారని.. రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను మార్చారన్నారు. రాజశేఖర్ రెడ్డి 7 కొండల్ని 2 కొండలు అంటేనే ఎంతో పోరాటం చేశామన్నారు.
Sajjala: తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఆరోపణలు చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేశారన్నారు.
Ambati Rambabu: ప్రపంచ వ్యాప్తంగా హిందువులు, తెలుగు ప్రజల మధ్య తిరుమల లడ్డూపై చర్చ జరుగుతుంది అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజకీయ కక్షతో చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారు.
Nimmala Ramanaidu: పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటున్నారు.. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అధికారంలోకి వచ్చిన ఎన్ని రోజులకి అమ్మఒడి ఇచ్చావు అంటూ ప్రశ్నించారు.