TG Venkatesh: ఇంట్లో తిరుమల సెట్టింగ్ వేస్తే నిన్ను నమ్మరు జగన్ అని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి తనపై వచ్చిన అభియోగాలను ఎందుకు పోగొట్టుకోవడం లేదని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలతో జగన్ ఇంకా ఆడుకుంటున్నాడు.. భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికుడు.. వైవీ సుబ్బారెడ్డి సతీమణి అన్యమతస్తురాలు.. అన్యమతస్తులను ఎందుకు టీటీడీ ఛైర్మన్లుగా నియమించారు అని ఆయన అన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలవడంపై హిందు సమాజం అగ్రహంతో ఉంది.. వైసీపీ హయాంలో టీటీడీలో గత ఐదు సంవత్సరాలలో అనేక అవకతవకలు జరిగాయన్నారు. జగన్ ఎందుకు డిక్లరేషన్ పై రార్థాంతం చేశాడు.. నెయ్యి వ్యవహారంలో ఖచ్చితంగా నేరస్తులు శిక్షింపబడతారు అని టీజీ వెంకటేశ్ అన్నారు.
Read Also: Devara collections : దేవర DAY -2 ఏపీ – తెలంగాణ కలెక్షన్స్.. బ్లాక్ బస్టర్
ఇక, పొట్టి శ్రీరాములు పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి మార్చి వేసి సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టాలన్న తెలంగాణ కేబినెట్ తీర్మానం శోచనీయం అని టీజీ వెంకటేశ్ పేర్కొన్నారు.
ఇక, భాషా ప్రయుక్త రాష్టాల కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని మాజీ ఎంపీ వెంకేటేశ్ తెలిపారు. అలాంటి వ్యక్తి పేరును మార్చాలను కోవడం మంచి పద్దతి కాదు.. పొట్టి శ్రీరాముల పేరును మార్చడాన్ని వెంటనే ఉప సహారించుకోవాలి.. సురవరం ప్రతాప్ రెడ్డి పేరును మార్చాలనుకుంటే ఇంకో సంస్థకు పెట్టుకోండి.. నామినేటెడ్ పోస్టులకు నేను అనర్హుడిని.. గవర్నర్ గా పనిచేయాలన్న ఆలోచన నాకు లేదు అని టీజీ చెప్పుకొచ్చారు.