YS Jagan: తాడేపల్లిలో పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో మాజీ సీఎం, వైయస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 4 నెలల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.. సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదన్నారు. చంద్రబాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.
వైసీపీ అధిష్టానానికి తత్వం బోథపడిందా? ఎన్నికలకు ముందు చేసిన ప్రయోగాలన్నీ వికటించాయన్న సంగతిని గ్రహించిందా? చేతులు కాలాకైనా ఆకులు పట్టుకుని కాస్త ఉపశమనం పొందుదామని అనుకుంటోందా? ఆ క్రమంలోనే ప్రస్తుతం పార్టీలో మార్పులు చేర్పులు జరుతున్నాయా? ఇంతకీ వైసీపీ పెద్దల్లో వచ్చిన ఛేంజ్ ఏంటి? జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయి? 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపిక దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఏకంగా 82 సిట్టింగ్ సీట్లను అప్పట్లో మార్చారు జగన్. ఇందులో కొందరికి…
TG Venkatesh: ఇంట్లో తిరుమల సెట్టింగ్ వేస్తే నిన్ను నమ్మరు జగన్ అని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి తనపై వచ్చిన అభియోగాలను ఎందుకు పోగొట్టుకోవడం లేదని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలతో జగన్ ఇంకా ఆడుకుంటున్నాడు.
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు లడ్డూపై దుర్మార్గపు వ్యాఖ్యలు చంద్రబాబు చేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా లడ్డూ కల్తీ జరిగిందని బలంగా ప్రచారం జరిపించారని అన్నారు. ఆ రోజే వైవీ సుబ్బారెడ్డి కోర్టును కూడా ఆశ్రయించారన్నారు.
డిక్లరేషన్ వివాదంపై పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తిరుపతి కొండకు వెళ్లడానికి డిక్లరేషన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు అంటున్నారని.. కొండపైకి వెళ్లడానికి జగన్ అఫిడవిట్ ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. ఏ ఉద్దేశంతో జగన్ను టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. జనాలను మోసం చేసినట్టు స్వామి వారిని మోసం చేయాలనుకోవడం చంద్రబాబు భ్రమే అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి దమ్ము, ధైర్యం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. భయపడలేదు కాబట్టే నిన్న ప్రెస్మీట్ పెట్టి నా మతం మానవత్వం అని చెప్పారన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రులు అనిత, డోల బాలవీరాంజనేయ స్వామి, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, పొలిట్ బ్యూరో సభ్యుల వర్ల రామయ్యలు భేటీ అయ్యారు. అనంతపురం జిల్లాలో రాముల వారి రథానికి నిప్పు పెట్టిన ఘటనపై పోలీసుల అధికారులు తీరుపై సీఎం వద్ద పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. తిరుమల పర్యటనపై పులివెందుల ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయాలకు పులకేశి నెంబర్ ఎంతివ్వాలో కూడా అర్ధం కావట్లేదని ఎద్దేవా చేశారు.. తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ చెప్పినవన్నీ కుంటి సాకులే అని విమర్శించారు..
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. రాజకీయాల కోసం దేవుడిని రోడ్డు మీదకి లాగారన్న ఆమె.. ప్రజలు తిరుమలకు వచ్చి ఇప్పుడు లడ్డూ తీసుకోవాలా..? తినాలా..? వద్దా..? అని అలోచిస్తున్నారు... అడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందా లేదా అని సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ప్రజలందరూ కూడా భయంతో ఉన్నారన్నారు.. ఏపీ, తెలంగాణ ప్రజలు ఎవరు దీనిని నమ్నరు.. కానీ, ఇతర ప్రాంతాల ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు…