Minister Vangalapudi Anitha: జగన్ అందుకే తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు.. అన్నీ కుంటిసాకులే..
- వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దుపై హోంమంత్రి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు..
- జగన్ చెప్పినవన్నీ కుంటి సాకులే అని విమర్శ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Vangalapudi Anitha: మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. తిరుమల పర్యటనపై పులివెందుల ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయాలకు పులకేశి నెంబర్ ఎంతివ్వాలో కూడా అర్ధం కావట్లేదని ఎద్దేవా చేశారు.. తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ చెప్పినవన్నీ కుంటి సాకులే అని విమర్శించారు.. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్తే తన తల్లికీ, చెల్లికి పట్టిన గతే తనకూ పడుతుందని భయపడి పర్యటన రద్దు చేసుకున్నాడన్న ఆమె.. డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక డైవర్షన్ రాజకీయాలు చేసింది జగనే అన్నారు.. లడ్డూ టేస్ట్ గురించి మాట్లాడిన జగన్.. ఏ రోజు తిరుమల లడ్డూ రుచి చూశాడో చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: Harish Rao: పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటి..
Also Read
- Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
- CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
ఇక, డిక్లరేషన్ ఇవ్వమంటే దళితులకు అంశాన్ని ముడిపెట్టి మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం జగన్ చేశాడని దుయ్యబట్టారు అనిత.. వైఎస్ జగన్ హయాంలో టీటీడీ బోర్డు మెంబరుగా దళితులకు అవకాశం ఇచ్చారా? అని ప్రశ్నించారు.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సీ అయిన ప్రస్తుత మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామికి ఆనాడు టీటీడీ బోర్డులో అవకాశం కల్పించారు.. హిందూ దళితురాలైన నాకు కూడా టీటీడీ బోర్డు అవకాశం వస్తే.. నాడు రాజకీయ రాద్దాంతం చేసి అది పోగొట్టేలా చేసింది జగనే.. అంటూ మండిపడ్డారు.. జగన్ చెప్పే మానవత్వం గురించి అతని తల్లీ, చెల్లిని చూస్తేనే అందరికి అర్ధమవుతుందన్న ఆమె.. దేశాన్ని కించపరుస్తున్న జగన్ ను దేశ బహిష్కరణ ఎందుకు చేయకూడదు..? అని ప్రశ్నించారు.. సెల్ఫ్ గోల్స్ తో తనని దేశ బహిష్కరణ చేయాలనే పరిస్థితిని జగనే తెచ్చుకున్నాడు.. జగన్ కు ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్ లో చుట్టి పక్కన పెట్టేయటం, అక్షింతలు వేస్తే తల దులిపేసుకున్న సందర్భాలు ఎన్నో చూడలేదా? నిన్న జగన్ పర్యటన సందర్భంగా ఒక్కరినైనా బైండోవర్ చేశామా లేక గృనిర్బంధo చేశామా? అని ప్రశ్నించారు.. శాంతి భద్రతల పరిరక్షణకు సాధారణంగా అమల్లోకి తెచ్చే సెక్షన్ 30 యాక్ట్ తెస్తే తనకే అది జారీ చేసినట్లు జగన్ కథలు అల్లాడు. దేవుడైనా తన గుమ్మం ముందుకు రావలనుకునే తత్వం జగన్ ది కాబట్టే ఇంటి వద్ద గుడి సెట్టింగ్ వేసుకున్నాడు అంటూ విమర్శలు గుప్పించారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!