Ex-Minister Roja: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..
- తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంలో రోజా సంచలన వ్యాఖ్యలు..
- రాజకీయాల కోసం దేవుడిని రోడ్డు మీదకి లాగారు..
- భక్తులు లడ్డూ తీసుకోవాలా..? తినాలా..? వద్దా..? అని ఆలోచిస్తున్నారు..
- చంద్రబాబు ఓ అబద్దాన్ని ప్రచారం చేశారని రోజా ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ex-Minister Roja: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. రాజకీయాల కోసం దేవుడిని రోడ్డు మీదకి లాగారన్న ఆమె.. ప్రజలు తిరుమలకు వచ్చి ఇప్పుడు లడ్డూ తీసుకోవాలా..? తినాలా..? వద్దా..? అని అలోచిస్తున్నారు… అడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందా లేదా అని సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ప్రజలందరూ కూడా భయంతో ఉన్నారన్నారు.. ఏపీ, తెలంగాణ ప్రజలు ఎవరు దీనిని నమ్నరు.. కానీ, ఇతర ప్రాంతాల ప్రజలు నమ్ముతున్నారు… సినిమాల్లో ఒక్కో గెటప్.. ఒక్కో డైలాగులు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తే అప్పుడు గెటప్పులు మారుస్తూ మాట్లాడుతుంటాడు పవన్ కల్యాణ్ అంటూ.. డిప్యూటీ సీఎం పవన్ పై సెటైర్లు వేశారు.. పాపం పవన్ కల్యాణ్‌కి ఏమి తెలియదు.. ఎవరు ఏది రాసిస్తే అది మాట్లాడడమే ఆయన పని.. ట్యాంకర్లు వచ్చింది, శాంపుల్ తీసుకుంది, ల్యాబ్ కు పంపింది, రిపోర్టు వచ్చింది అన్నీ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాకే అన్నారు..
Read Also: TG New VC: దసరాలోపు వర్సిటీలకు కొత్త వీసీల నియామకం..
Also Read
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా జీరో చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఇలాంటి కుట్రకు తేరలేపారని ఆరోపించారు రోజా.. సీఎం చంద్రబాబు నాయుడుకి తప్పు చేశామని తెలిసే సైడ్ అయ్యారు.. పవన్ కల్యాణ్‌ను ముందర పెట్టి డ్రామాలాడిస్తున్నాడు.. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు భక్తి లేదు.. బూట్లతో.. చెప్పులతో దేవుడిని మొక్కుతాడు, పూజలు చేస్తాడని విమర్శించారు.. తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చాడంతో అదే తిరుమలలో చంద్రబాబుకు బాంబ్ బ్లాస్ట్ జరిగి.. దేవుడు శిక్ష వేశాడు… అయినా బుద్ది రాలేదని మండిపడ్డారు. ఇప్పుడు.. వెంకటేశ్వర స్వామి మీదే నమ్మకం లేకుండా చేశాడు చంద్రబాబు.. ఇలాంటి దరిద్రపు రాజకీయాలు దేశంలో ఏ రాజకీయ నేత చేయలేదు.. ఒక దొంగ రిపోర్టును తీసుకొని వచ్చి జంతువుల కొవ్వు కలసిందని అబద్ధం చెప్పారు.. రిపోర్టును టీడీపీ ఆఫీసులో ఎందుకు బయటపెట్టారు.. ఎలా వచ్చింది..? అని నిలదీశారు..
Read Also: Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశం
లడ్డూ వివాదంపై సీబీఐ విచారణను మేం అడిగాం… కానీ, చంద్రబాబు ప్రెస్‌మీట్‌లు పెడుతూ డ్రామాలాడుతున్నాడు అని మండిపడ్డారు రోజా.. ఇప్పటివరకు కుల రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేశాడు… ఇప్పుడు మత రాజకీయాలు ప్రారంభించారన్న ఆమె.. పవన్ కల్యాణ్ వాళ్ల నాన్న, అన్న అందరూ దేవుడు లేడంటూ దారుణంగా మాట్లాడారు.. నా భార్య క్రిస్టియన్ అని చెప్పాడు.. ఇప్పుడేమో సనాతన ధర్మం అంటాడు అని దుయ్యబట్టారు.. చంద్రబాబు సీఎం అవ్వడానికి అబద్ధపు హామీలు ఇచ్చాడు.. ఈవీఎంలను మేనేజ్ చేసి ఎలా గెలిచాడో అందరికీ తెలసున్నారు.. ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో ఇచ్చిన హామీ ఏ ఒకటి నెరవేర్చలేదు.. వరదల్లో ప్రజలుంటే కనీసం వారికి నీళ్లు, చిన్నపిల్లలకు పాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇక, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి.. వీటన్నింటినీ డైవర్ట్ చేయడానికి లడ్డూ వివాదాన్ని తెరపైకి చంద్రబాబు తెచ్చాడు.. దేవుడి మీద భక్తి.. భయం ఉంటే సీఎం, డిప్యూటీ సీఎం మొదట విచారణ జరపాలి.. తప్పు చేసిన వారికి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.. అలా కాకుండా వాళ్ల వంద రోజుల సమావేశంలో ఒక అబద్ధపు ప్రచారాన్ని లడ్డూపై చంద్రబాబు మాట్లాడాడు. దానికోసం ఒక ఫేక్ రిపోర్టును బయటకు తీసుకోవచ్చారు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా..
తాజావార్తలు
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!