RK Roja: మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. జనాలను మోసం చేసినట్టు స్వామి వారిని మోసం చేయాలనుకోవడం చంద్రబాబు భ్రమే అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి దమ్ము, ధైర్యం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. భయపడలేదు కాబట్టే నిన్న ప్రెస్‌మీట్ పెట్టి నా మతం మానవత్వం అని చెప్పారన్నారు. బైబిల్ చదువుతారని, ఇతర మతాలను గౌరవిస్తానని జగన్ చెప్పారని మాదీ మంత్రి రోజా తెలిపారు. చంద్రబాబుకు దేవుడు అంటే భయం, భక్తి రెండు లేవని విమర్శించారు. ప్రశాంతమైన వాతావరణంలో జగన్ దేవుడిని దర్శించుకుందామని వస్తే కూటమి నేతలు దాడులు చేస్తామని హెచ్చరించారని ఆరోపించారు. వైసీపీ నేతలందర్నీ హౌస్ అరెస్ట్ చేసి నోటీసులు ఇచ్చారన్నారు.
Read Also: Botsa Satyanarayana: సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు బొత్స స్ట్రాంగ్ కౌంటర్
ప్రశాంత వాతావరణం లేదు కనుక జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారని రోజా వెల్లడించారు. వైఎస్ 5 సార్లు, జగన్ 5 సార్లు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారని ఆమె పేర్కొన్నారు. ఈ రోజు కాకపోతే రేపైనా స్వామివారిని ఒక భక్తుడిలా జగన్ దర్శించుకుంటారన్నారు. కానీ డిక్లరేషన్ పేరుతో మీరు చేస్తున్న రాజకీయం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇన్నాళ్లు కుల రాజకీయాలు చేసిన చంద్రబాబు ఇప్పుడు మత రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. మీకు దేవుడే బుద్ధి చెబుతాడన్నారు.