డిక్లరేషన్ వివాదంపై పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తిరుపతి కొండకు వెళ్లడానికి డిక్లరేషన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు అంటున్నారని.. కొండపైకి వెళ్లడానికి జగన్ అఫిడవిట్ ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. ఏ ఉద్దేశంతో జగన్ను టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. జనాలను మోసం చేసినట్టు స్వామి వారిని మోసం చేయాలనుకోవడం చంద్రబాబు భ్రమే అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి దమ్ము, ధైర్యం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. భయపడలేదు కాబట్టే నిన్న ప్రెస్మీట్ పెట్టి నా మతం మానవత్వం అని చెప్పారన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రులు అనిత, డోల బాలవీరాంజనేయ స్వామి, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, పొలిట్ బ్యూరో సభ్యుల వర్ల రామయ్యలు భేటీ అయ్యారు. అనంతపురం జిల్లాలో రాముల వారి రథానికి నిప్పు పెట్టిన ఘటనపై పోలీసుల అధికారులు తీరుపై సీఎం వద్ద పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. తిరుమల పర్యటనపై పులివెందుల ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయాలకు పులకేశి నెంబర్ ఎంతివ్వాలో కూడా అర్ధం కావట్లేదని ఎద్దేవా చేశారు.. తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ చెప్పినవన్నీ కుంటి సాకులే అని విమర్శించారు..
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. రాజకీయాల కోసం దేవుడిని రోడ్డు మీదకి లాగారన్న ఆమె.. ప్రజలు తిరుమలకు వచ్చి ఇప్పుడు లడ్డూ తీసుకోవాలా..? తినాలా..? వద్దా..? అని అలోచిస్తున్నారు... అడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందా లేదా అని సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ప్రజలందరూ కూడా భయంతో ఉన్నారన్నారు.. ఏపీ, తెలంగాణ ప్రజలు ఎవరు దీనిని నమ్నరు.. కానీ, ఇతర ప్రాంతాల ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు…
వైఎస్ జగన్.. తిరుమల పర్యటన వాయిదా పడటానికి ప్రభుత్వమే కారణం అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. వైఎస్ జగన్ తిరుమల పర్యటన వాయిదా పడటంపై స్పందించిన ఆయన.. దీనికి ప్రభుత్వమే కారణం అన్నారు.. నిన్న తిరుమలలో ఉన్న వాతావరణం ప్రజలందరూ గమనించారు.. జగన్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు ఇచ్చారు.. అన్యమతస్తులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని బోర్డులు పెట్టారు.. జగన్ పర్యటన రద్దు అవగానే బోర్డులు తీసేశారని విమర్శించారు.
కవిత్వమే ఆయుధంగా మూఢాచారాలపై తిరగబడిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా.. సంఘ సంస్కరణే లక్ష్యంగా ఆ మహనీయుడు సృష్టించిన సాహిత్యం ఎప్పటికీ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోదుంటే అతిశయోక్తి కాదు.. తెలుగు సాహితీ లోకంలో ఆయన దిగ్గజ వ్యక్తిగా నిలిచిపోతారు..
జిల్లాల్లో సీఎం పర్యటనల కోసం రెండు అడ్వాన్స్ టీమ్లు ఏర్పాటు ఏపీలో జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటనల కోసం రెండు అడ్వాన్స్ టీమ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో టీంలో సభ్యులుగా ఆరుగురు అధికారులను నియమించింది. రెవెన్యూ, పోలీస్, సమాచార శాఖ, ప్రణాళిక శాఖలకు చెందిన అధికారులతో అడ్వాన్స్ టీమ్లు నియామకమయ్యాయి. అడ్వాన్స్ టీం-1లో వేణుగోపాల్, రాజశేఖర్, రాంబాబు, రమణ, శాంతారావు, సూర్యచంద్రరావులు ఉన్నారు. అడ్వాన్స్ టీం-2లో కృష్ణమూర్తి, శివరాం ప్రసాద్, రాజు, శ్రీనివాసరావు, మల్లిఖార్జున రావు, నాగరాజాలు…
తిరుమలకు జగన్ వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తిరుమల వెళ్లకుండా ఉండడానికి జగన్కు ఏ సాకులు ఉన్నాయో తెలియదన్నారు. జగన్ తిరుమలకు వెళ్లొద్దని ఎవరైనా చెప్పారా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. దేవుడి ఆచారాలు, సాంప్రదాయాలను ఎవరైనా గౌరవించి తీరాల్సిందేనన్నారు.