మంగళగిరి నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాలని భావించామని తెలిపారు. అధికార దుర్వినియోగంతో కార్యకర్తలకు నష్టం చేస్తున్నప్పుడు కచ్చితంగా భరోసా ఇవ్వాలి.. పార్టీ తోడుగా ఉంటుందనే విశ్వాసం కల్పించాలి.. ఆ ఉద్దేశంతోనే ఈసమావేశం ఏర్పాటు చేశాం, పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నామని అన్నారు. అన్నింటికీ తట్టుకుని పార్టీ కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి ఉండాలని భావించి వేమారెడ్డిని ఇన్‌ఛార్జిగా నియమించామని జగన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి.. ఐదేళ్లపాలనలో ప్రతి ఇంటికీ మనం మంచిచేశాం.. ప్రతి ఇంటికీ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం.. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నిలబెట్టే పార్టీ వైయస్సార్‌కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. బడ్జెట్‌తో పాటు సంక్షేమ క్యాలండర్ కూడా విడుదల చేసే వాళ్లం.. ప్రతినెలలో క్రమం తప్పకుండా బటన్ నొక్కి పథకాలు అమలు చేశామని జగన్ పేర్కొన్నారు. ఇది కేవలం ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పాలనలోనే జరిగిందని తెలిపారు.
Delhi: న్యూట్రిషన్ సెక్యూరిటీపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
అనేక సంక్షోభాలను ఎదుర్కున్నాం.. కోవిడ్ లాంటి మహా సంక్షోభాన్ని ఎదుర్కున్నాం.. రెండేళ్ల పాటు కోవిడ్‌తో యుద్ధం చేశాం.. రాబడులు తగ్గిపోయాయి, ఖర్చులు విపరీతంగా పెరిగాయని జగన్ చెప్పారు. అయినా ఏ రోజు కూడా సాకులు చూపకుండా పథకాలు అమలు చేశామన్నారు. స్కూళ్లు, ఆస్పత్రులను మార్చాం.. మంచి వైద్యాన్ని గ్రామాలకే తీసుకు వచ్చాం.. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో గొప్ప మార్పులు తీసుకు వచ్చాం.. ఎప్పుడూ లేని విధంగా ఉచిత పంటల బీమాను అమలు చేశామని తెలిపారు. వివక్ష లేకుండా, రాజకీయాలు చూడకుండా పథకాలు ఇచ్చాం.. మనకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఆధారంగా పథకాలు ఇచ్చాం.. ప్రతి ఇంటి గడప వద్దకే పెన్షన్, రేషన్‌లే కాకుండా పథకాలూ అందించామన్నారు. దిశ యాప్ ద్వారా అక్కచెల్లెమ్మలకు భద్రత కల్పించాం.. 10 నిమిషాల్లోపే పోలీసులు వచ్చి భద్ర కల్పించేలా చేశామని వెల్లడించారు. ఇప్పుడు పరిస్థితులు ఏంటో మీరు చూడండి.. ప్రతి అంశంలోనూ తిరోగమనం కనిపిస్తుంది.. వివక్ష, పక్షపాతం కనిపిస్తున్నాయని ఆరోపించారు. ప్రతి ఇంట్లోనూ దీనిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.. జగన్ పలావు పెట్టాడు.. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు.. ఇప్పుడు పలావూ పోయింది.. బిర్యానీ పోయిందనే చర్చ జరుగుతోందని తెలిపారు.
Minister Narayana: మద్యం టెండర్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. మంత్రి ఆగ్రహం
ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తున్నారు.. ఆరోగ్య శ్రీ అటకెక్కింది.. బిల్లులు చెల్లించడం లేదని వైఎస్ జగన్ అన్నారు. ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎగరగొట్టారు.. కొత్త మెడికల్ కాలేజీలన్నీ వెనకడుగు.. ప్రభుత్వం ఎందుకు ఉందో అర్థం కావడం లేదన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయాలి.. సంస్థాగతంగా అత్యంత బలంగా ఉండాలని జగన్ నేతలకు సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు ఉంటాయి.. కష్టాల నుంచే నాయకులు పుడతారన్నారు. తనను16 నెలలు జైల్లో పెట్టి తీవ్రంగా వేధించారు.. అయినా ప్రజల ఆశీస్సులతో మనం ముందడుగు వేశాం.. కష్టాలు ఎక్కువ కాలం ఉండవని చెప్పారు. రెడ్‌బుక్ అనేది ఏమైనా పెద్దపనా..? అని జగన్ ప్రశ్నించారు. ఎప్పుడూ లేని దుష్ట సంప్రదాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం తీసుకు వచ్చింది.. ఇప్పుడు తాను చేయొద్దని చెప్పినా తమ వాళ్లు కూడా బుక్స్ మెయింటెన్ చేయడం మొదలుపెడుతున్నారు.. అన్యాయం చేసేవారి పేర్లను, అలాంటి అధికారుల పేర్లను రాసుకుంటున్నారు.. అదే సమయంలో తాము గుడ్‌బుక్ కూడా రాసుకోవడం మొదలుపెట్టామన్నారు. పార్టీకి మంచి చేసిన వారిని, కష్టపడే వారి పేర్లను కూడా రాసుకుంటున్నాం.. వారికి తప్పకుండా అవకాశాలు, ప్రమోషన్లు ఉంటాయని జగన్ అన్నారు.