వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత.. వరద సాయంపై చర్చకు రావాలని సవాల్ చేశారు.. వరద సాయంపై చర్చించడానికి మేం సిద్ధం.. వైసీపీ నుంచి చర్చకు ఎవరైనా వస్తారా..? అని చాలెంజ్ చేశారు..
వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఫైర్ అయ్యారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వరదల సమయంలో చంద్రబాబు ప్రజలను ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శం అన్నారు.. ఇంటింటికీ ఆహారం, మంచినీరు, అందించారు.. ప్రజలు అందరూ చంద్రబాబు వల్లే నేడు ఈ వరదల నుంచి బయట పడ్డామని గొప్పగా చెప్పారు.. ఇటువంటి వాటిని చూసి వైసీపీ నేతలు భరించ లేక పోతున్నారు.. వరదలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేశారని అనడానికి సిగ్గు ఉండాలి.
YS Jagan: సీఎం చంద్రబాబు వ్యవహార శైలిపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా చంద్రబాబులో ఏ మార్పు రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంబటి రాంబాబు.... ఏపీ పాలిటిక్స్ మీద కాస్త అవగాహన ఉన్న ఎవరికైనా....అస్సలు పరిచయం అక్కర్లేని పేరు. మంత్రి హోదాలో మాట్లాడినా, వైసీపీ ప్రతినిధిగా మైకందుకున్నా... తన వాగ్ధాటితో ప్రత్యర్థుల మీద విరుచుకుపడే అంబటి... ప్రస్తుతం కొత్త చిక్కుల్లో పడ్డారన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోందట.
తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీకోర్టు తీర్పును స్వాగతించారు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.. టీటీడీ లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుని బీజేపీ స్వాగతిస్తుందన్న ఆయన.. టీటీడీ విషయంలో గతంలో అధికార పార్టీని బీజేపీ నిలదీయటం జరిగింది .. అంతర్వేది లక్ష్మీ నరసింహాస్వామి రథం తగలపెట్టిన ఘటనలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. హిందూ వ్యతిరేక దాడులు గత ప్రభుత్వంలో చాలా జరిగాయి..
తిరుమల లడ్డూ వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్.. చంద్రబాబు నిజ స్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపిందన్నారు.. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మత భావాలను రాజకీయాల కోసం ఎలా రెచ్చ గొడుతున్నాడు అనేది సుప్రీం గుర్తించిందని.. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని స్ట్రాంగ్ కామెంట్స్ చేసిందన్నారు.. ఇక, చంద్రబాబు సిట్ ను సుప్రీం రద్దు చేసింది.. స్వామివారిని, స్వామివారి ప్రసాదాన్ని రాజకీయాల కోసం అబద్ధాలు ఆడి జంతువుల కొవ్వు…
Satya Prasad: అధికారం లేక పిచ్చి పట్టినట్లుగా మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారు.. అందుకే అప్పుడే ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార దుర్వినియోగం తీవ్రంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం చాలా ముఖ్యం.. కష్టం వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలబడగలిగాలి.. అప్పుడే ప్రజల ఆశీస్సుల ఉంటాయి.