వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటనకు సిద్ధం అయ్యారు.. నేటి నుంచి రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది..
Roja: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై అందరూ ఆతృతగా ఎదురు చూసారు.. ఆయన ప్రసంగంలో జగన్ ను తిట్టిస్తూ.. చంద్రబాబును పొగిడించుకున్నారు అని వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు.
‘కేసీఆర్’ ఇంటర్నెట్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత! మాజీ సీఎం కేసీఆర్ వీరాభిమాని, దివ్యాంగుడైన చిర్రా సతీశ్ జిరాక్స్ సెంటర్ను ఎమ్మెల్సీ కవిత సోమవారం ప్రారంభించారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగుడైన సతీశ్కు ఆర్థికంగా చేయూతనందించిన కవిత.. నేడు ‘కేసీఆర్’ ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్ను ఆరంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ రవీందర్ రావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, మాజీ ఎంపీ మలోత్ కవిత పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా…
RK Roja: వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తాడేపల్లిలోని ఆయన నివాసంలో మాజీ మంత్రి ఆర్కే రోజా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో నగరి నియోజకవర్గంలో నెలకొన్న తాజా పరిణామాలపై ప్రధానంగా చర్చ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.
Minister Anagani: జగన్ రెడ్డికి కావాల్సింది ప్రతిపక్ష హోదానే ప్రజా సమస్యలు కాదు అని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. శాసన సభా సభ్యత్వం రద్దవుతుందనే భయంతోనే ఈరోజు జగన్ రెడ్డి సభకు వచ్చారు.. ప్రతిపక్ష నేత హోదా లేకున్నా ఏపీ అసెంబ్లీలో వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నేతలెందరో ప్రజా సమస్యల్నీ సమర్ధవంతంగా లేవనెత్తారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన వైఎస్ జగన్.. అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం లేనందున అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది.. అసెంబ్లీకి వెళ్లినా.. వెళ్లకున్నా.. ప్రజా సమస్యల పై పోరాటం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు..
మొదటి నుంచి అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించాలని కోరామని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తమ నేత ప్రజా సమస్యలపై మాట్లాడాలని అడిగామన్నారు. అందరూ సభ్యుల లాగే అసెంబ్లీలో అవకాశం ఇస్తే తమ నేత వైఎస్ జగన్ కు కూడా కేవలం ఒకటి, రెండు నిమిషాల సమయం మాత్రమే ఇస్తారన్నారు.
అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశాం. ప్రజల పక్షాన మాట్లాడేది ప్రతిపక్షం అవసరం అన్నారు బొత్స.. అలాంటి హోదా తమకు ఇవ్వకుండా గొంతు నొక్కలని చూస్తున్నారని మండిపడ్డారు.. సభలో ఉన్నది రెండే పక్షాలు అని.. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పేంటి? అని నిలదీశారు.. మిర్చి రైతుల ఇబ్బందులు ప్రభుత్వ పట్టించుకోవటం లేదు. మా నేత జగన్ వెళ్ళే వరకు మిర్చి రైతుల ఇబ్బందులు పట్టించుకోలేదన్నారు..
గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేశారు వైసీపీ సభ్యులు.. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే.. అసెంబ్లీలో వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు సభ్యులు.. పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఆ తర్వాత సభ వాకౌట్ చేశారు.. గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే.. సభ నుంచి వెళ్లిపోయారు..
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు.. ఇక, గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు.