ప్రభుత్వం ఎక్కడా వ్యక్తిగత కక్షలకు వెళ్లడం లేదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చామన్నారు. స్పీకర్పై తప్పుడు రాతలు బాధాకరమన్నారు. ఎవరు ఎక్కడ ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారని, ప్రజాప్రతినిధులుగా ప్రజలు తరపున పోరాడాల్సి ఉందన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా ఇది కరెక్టు కాదని, చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి చెప్పుకొచ్చారు. బుధవారం అసెంబ్లీలో మంత్రి…
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదాపై అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలతో జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఎంతటి వారిపైనైనా అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారు. స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా నియమాల ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు. సంధి ప్రేలాపనలుగా పరిగణించి సభాపతి హోదాలో క్షమిస్తున్నా అని, తప్పుడు ప్రచారానికి తెరదించేందుకు రూలింగ్ ఇవ్వాలని నిర్ణయించాను అని స్పీకర్ తెలిపారు. బుధవారం…
కూటమి ప్రభుత్వానికి, టీడీపీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. ఆరేళ్ల క్రితం మాట్లాడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతున్నాయని పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేయడం దారుణమైన విషయమన్న ఆమె.. అక్రమంగా 111 కేసు పెట్టి , పోసానిని అక్రమ కేసులో ఇరికించారని ఆరోపించారు.. గతంలో ప్రధాని నరేంద్ర మోడీపై చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దారుణంగా మాట్లాడలేదా...? వాళ్లపై ఇదే దేశద్రోహం సెక్షన్ల కింద కేసు నమోదు చేయగలరా? అని…
సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు ఓబులవారిపల్లెకు తరలించారు. ఓబులవారిపల్లె పీఎస్లో పోసానికి వైద్య పరీక్షలు చేశారు. ఓబులవారిపల్లి ప్రాథమిక వైద్య కేంద్రం వైద్యులు గురు మహేష్ పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. గురు మహేష్ స్టేట్మెంట్ను రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు నమోదు చేశారు. కాసేపట్లో రైల్వే కోడూరు కోర్టులో పోసానిని హాజరుపరిచే అవకాశం ఉంది. బుధవారం రాత్రి హైదరాబాద్లోని రాయదుర్గంలో పోసానిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడు, నారా…
సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టును వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఖండించారు. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని మండిపడ్డారు. అరెస్ట్ నేపథ్యంలో పోసాని భార్య కుసుమలతను జగన్ ఫోన్లో పరామర్శించారు. అరెస్ట్ విషయంలో పోసానికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జరుగుతున్న వ్యవహారాలను ప్రజలు, దేవుడు చూస్తున్నారని.. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. ‘ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోంది. అరెస్ట్ విషయంలో పోసాని కృష్ణమురళికి వైసీపీ…
వైఎస్ జగన్మోహన్రెడ్డి వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు.. గత రెండు రోజులుగా ఆయన ఫీవర్తో బాధపడుతోన్నట్టుగా తెలుస్తుండగా.. అయినా, ఈ రోజు కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొన్నారు మాజీ సీఎం.
రెండో రోజు పర్యటనలో భాగంగా.. ఈ రోజు ఉదయం 9 గంటలకు పులివెందుల పట్టణంలోని గుంత బజార్ లో ఉన్న వైయస్సార్ పౌండేషన్ మరియు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా ఆధునికరించిన వైయస్ రాజారెడ్డి ఐ సెంటర్ ను ప్రారంభిస్తారు.. అనంతరం మధ్యాహ్నం 12. 20 గంటలకు పులివెందుల నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరు బయలుదేరి వెళ్లనున్నారు..
జగన్ కు ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అనేది ప్రభుత్వం నిర్ణయమని అభిప్రాయపడ్డారు జీవీ హర్ష కుమార్.. కానీ, గతంలోని ఢిల్లీలో మూడు సీట్లు వచ్చినా బీజేపీకి ప్రతిపక్షహోదా ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం జగన్ ను చూసి భయపడుతోందని, అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని ఆరోపించారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్ష కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్ 2 అభ్యర్థులను సీఎం చంద్రబాబు దారుణంగా మోసం చేశారని విమర్శించారు.
మాజీ సీఎం జగన్ తీరు పై అసహనం వ్యక్తం చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగించడం మంచి సంప్రదాయం కాదన్నారు.. సభ్య సమాజం తలదించుకునేలా జగన్ వైఖరి ఉందన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదు అని స్పష్టం.. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు..