Harsha Kumar: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వేళ.. మరోసారి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా తెరపైకి వచ్చింది.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన మాజీ ఎంపీ హర్షకుమార్ హాట్ కామెంట్లు చేశారు.. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అనేది ప్రభుత్వం నిర్ణయమని అభిప్రాయపడ్డారు జీవీ హర్ష కుమార్.. కానీ, గతంలోని ఢిల్లీలో మూడు సీట్లు వచ్చినా బీజేపీకి ప్రతిపక్షహోత ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం జగన్ ను చూసి భయపడుతోందని, అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని ఆరోపించారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్ష కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్ 2 అభ్యర్థులను సీఎం చంద్రబాబు దారుణంగా మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు ఫోన్ రికార్డింగ్ ఆడియో రిలీజ్ చేసి గ్రూప్-2 పరీక్ష విషయంలో డ్రామా ఆడారని మండిపడ్డారు.. అంతేకాదు.. పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ కంటే సీఎం చంద్రబాబు గొప్ప నటులు అంటూ సెటైర్లు వేశారు.. ఎల్లుండి జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రూప్ 2 అభ్యర్థులు ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగల్లో చంద్రబాబు అన్ని అవాస్తవాలే చెప్పించారని ఆరోపించారు మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్..
Read Also: Minister Seethakka: బండి సంజయ్.. భారతదేశం గొప్పతనాన్ని తగ్గించొద్దు!