షర్మిల ఫోన్ ట్యాపింగ్ పై వైఎస్ జగన్ స్పందించారు. పక్క రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ తో మాకేంటి సంబంధమని చెప్పారు. షర్మిలమ్మ అప్పట్లో క్రియాశీలకంగా ఉందని చేశారేమో.. అసలు చేసారో లేదో మాకేలా తెలుస్తుందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తెలంగాణకు చెందిన నేతల ఫోన్లనే కాదు.. ఏపీకి చెందిన నేతల ఫోన్లు ట్యాప్ చేసి కూడా.. గతంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఇచ్చారనే ఆరోపణలు వినపడుతున్నాయి.
Also Read:Chennai Metro: మెట్రో సైట్‌లో కూలిన గిర్డర్లు.. L&Tకి రూ.1 కోటి జరిమానా
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవమేనన్న ఆమె.. నా ఫోన్, నా భర్త ఫోన్, నా దగ్గరివాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారని.. అసలు, ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నాకు చెప్పారని తెలిపారు.. ఆనాడు ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి నాకే వినిపించారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తానని వెల్లడించారు వైఎస్ షర్మిల.