YS Jagan Accuses CM Chandrababu of Revenge Politics: కాలేజ్ రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పుతో కొట్టారని సీఎం చంద్రబాబు గుర్తు పెట్టుకున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. కాలేజ్ రోజుల్లో అందరూ ఉడుకు రక్తం మీద ఉంటారని, అది గుర్తు పెట్టుకుని ఆయన కొడుకు మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైల్లో పెట్టారని, చంద్రబాబు సొంత నియోజకవర్గంలో గెలిచారని ఇదంతా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులందరి మీద తప్పుడు కేసులే అని పేర్కొన్నారు. ఒక తప్పుడు సాంప్రదాయంలో చంద్రబాబు కేసులు పెడుతున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. నెల్లూరు పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.
‘ఇంత విచ్చవిడిగా అవినీతి జరుగుతున్నా ఎవరూ మాట్లాడకూడదు. వీళ్లకు నచ్చిన వాళ్లు ఉంటే 99 పైసలకు భూములు ఇచ్చేస్తారు. ప్రతీదీ మోసం అని తేలిపోయింది. ఏ మనిషి సంతోషంగా లేరని తేలిపోయింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైళ్లో పెట్టారు. నందిగాం సురేష్, జోగి రమేష్ కొడుకును జైళ్లో పెట్టారు. ఎంపీ మిథున్ రెడ్డిని జైళ్లో పెట్టారు. కాలేజ్ రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబును చెప్పుతో కొట్టారని గుర్తు పెట్టుకున్నారు. కాలేజ్ రోజుల్లో అందరూ ఉడుకు రక్తం మీద ఉంటారు. అది గుర్తు పెట్టుకుని ఆయన కొడుకు జైల్లో పెట్టారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచారని చెవిరెడ్డిని జైల్లో పెట్టారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో గెలిచారని ఇదంతా చేశారు. భాస్కర్‌ను వేధించి వేధించి జైళ్లో పెట్టారు. కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్‌ను దొంగ కేసుల్లో పెడదామని చూస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు భార్గవ్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఆయన కొడుకు.. దేవినేని అవినాష్, తలశిల రఘురాం, అంబటి రాంబాబు, చంద్రశేఖర్ ఇలా చెప్పుకుంటూ పోతే అందరి మీదా కేసులే’ అని వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.
Also Read: Oval Test: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. భారత్ తుది జట్టులో మూడు మార్పులు! మళ్లీ వచ్చేశాడు బాబోయ్
‘నాయకులందరి మీద తప్పుడు కేసులే. ఇవి కాక నాయకుల మీద, కార్యకర్తల మీద వేల సంఖ్యలో కేసులు. ఒక తప్పుడు సాంప్రదాయంలో చంద్రబాబు కేసులు పెడుతున్నారు. ఇప్పుడు మీరు విత్తిన విత్తనాలు చెట్లవుతాయి. అందరికీ వడ్డీతో సహా లెక్కలు కడతాం. మూడేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది. అందరి లెక్కలు సరిచేస్తాం. తప్పులు తెలుసుకో.. పద్దతి మార్చుకో చంద్రబాబు. లేకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యత. అధికారులకు కూడా చెప్తున్నాం. మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకువస్తాం. ప్రతీ ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతాం. గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నాం’ అని మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.