క్షేత్ర స్థాయి పర్యటనల పై ఫోకస్ పెట్టారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. కలెక్టర్లు గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండింటిని ప్రతి వారం సందర్శించాలని సూచించారు.. జాయింట్ కలెక్టర్లు వారానికి నాలుగు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలన్న ఆయన.. మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు వారానికి 4 సచివాలయాలను సందర్శించాలని సూచించారు.. దీనివల్ల అక్కడ సమస్యలు ఏమున్నాయో తెలుస్తుందన్నారు సీఎం వైఎస్ జగన్. మరోవైపు.. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టగానే నేను వారానికి రెండు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తానని తెలిపారు సీఎం.. ఎమ్మెల్యేలు, అధికారులను కలిపి మండలస్థాయిలో ప్రతిరోజు ఒక గ్రామ, వార్డు సచివాలయాన్ని సందర్శించే కార్యక్రమం మొదలుపెట్టబోతున్నాం అన్నారు.. ఇక, డిసెంబర్ 31 కల్లా 4024 గ్రామాలకు ఫైబర్ కనెక్షన్ ఉండాలని అధికారులను స్పష్టం చేశారు ఏపీ సీఎం.. ఆ సమయానికల్లా ఆయా పంచాయతీల్లో డిజిటల్ లైబ్రరీలు రెడీ కావాలని ఆదేశించారు.. కలెక్టర్లు, ఎస్సీలు రెండు వారాలకు ఒకసారి కలిసి కూర్చోవాలని.. ప్రజల సమస్యలపై చర్చించాలని.. వీటి పరిష్కారం విషయంలో ముందగుడు వేయాలని.. వివిధ దుకాణాలద్వారా అమ్ముతున్న విత్తనాలు నాణ్యత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో పరిశీలన చేయాలని.. నకిలీలను అడ్డుకోవడానికి గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.