కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన వర్చువల్ సమావేశంలో వివిధ ప్రతిపాదనలు కేంద్రం ముందు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కర్నూల్ జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టు కోసం ఏపీ ఖర్చు పెట్టిన రూ. 176 కోట్ల నిధులను రీ-ఇంబర్స్ చేయాలని కోరిన ఏపీ.. ఉడాన్ పథకంలో భాగంగా ఓర్వకల్లు ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం పెట్టిన ఖర్చుని తిరిగివ్వాలని ప్రతిపాదనలు చేసింది.. ఇక, భోగాపురం ఎయిర్ పోర్టు వినియోగంలోకి వచ్చాక.. విశాఖ విమానాశ్రయాన్ని 30 ఏళ్ల పాటు…
తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించింది.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన గులాబ్ సైక్లోన్ వల్ల పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు పరిహారం అందించనున్నారు… సంబంధిత రైతుల ఖాతాల్లో 22 కోట్ల రూపాయల పంట నష్ట పరిహారం అందించనుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. రేపు రైతుల ఖాతాల్లో నేరుగా ఆ సొమ్మును జమ చేయనున్నారు సీఎం…
రాష్ట్రంలో పాదయాత్ర అంటే గుర్తొచ్చేది దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి 4 ఏళ్ళు పూర్తైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు పుష్ప శ్రీవాణి. విజయనగరం జిల్లా కురుపాం మండల కేంద్రంలో వైసిపి నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేశారు ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి దంపతులు. అనంతరం ధూళికేశ్వరస్వామి ఆలయం…
వరుసగా పెరుగుతూ పెట్రో ధరలు ఆల్‌టైం హై రికార్డులు సృష్టించాయి.. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో.. కేంద్రం కోత విధించింది.. ఇక, కేంద్రం బాటలోనే మరికొన్ని రాష్ట్రాలు అడుగులు వేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ వాటాను కూడా తగ్గించాయి. దీంతో.. ఇప్పుడు తగ్గించని రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోంది.. అందులో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా ఒకటి కాగా.. పెట్రో ధరలపై పోరాటానికి సిద్ధం అవుతోంది తెలుగుదేశం పార్టీ.. ఇవాళ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఈ…
ముఖ్యమంత్రి వైయస్.జగన్ చేసిన ప్రజాసంకల్ప యాత్రకు ఇవ్వాళ్టితో (శనివారం) నాలు గేళ్లు పూర్తిచేసుకుంది. ఇడుపులపాయలో దివంగత మహానేత వైయస్సార్ సమాధివద్ద 2017 నవంబర్ 6న పాదయాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలో 13 జిల్లాలను దాటుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ…
బద్వేల్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టింది.. ఏకంగా 90,533 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఘన విజయం సాధించారు. ప్రతీ రౌండ్లోనూ వైసీపీ ఆధిక్యం సాదిస్తూ దూసుకెళ్లింది.. మొత్తంగా వైసీపీకి 1,12,211 ఓట్లు పోలుకాగా.. బీజేపీకి 21,678 ఓట్లు వచ్చాయి.. ఇక, కాంగ్రెస్ పార్టీకి 6,235 ఓట్లు వచ్చాయి. దీంతో.. బీజేపీ, కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయాయి. ఇక, బద్వేల్ ఉప ఎన్నిక ఫలితంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన…
ధాన్యం సేకరణ, కొనుగోళ్ల పై మంత్రుల బృందంతో సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. కీలక సూచనలు చేశారు.. ధాన్యం సేకరణపై పటిష్ట విధానం ఉండాలని ఆదేశించారు.. ఆర్బీకేల స్థాయిలోనే, ఫాంగేట్ వద్దే కొనుగోళ్ళు జరగాలని.. మోసాలు, అవినీతికి తావులేకుండా అత్యంత పారదర్శక విధానం అమలు చేయాలని.. రైతుకు మంచి ధర వచ్చేలా చూసేందుకే ఈ చర్యలు తీసుకోవాలని సూచించారు.. ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం సేకరణ కేంద్రాలు ఉండాలన్న ఏపీ సీఎం.. పేమెంట్స్‌లో మోసాలు లేకుండా…
నా చర్మంతో సీఎం వైఎస్ జగన్‌కు చెప్పులు కుట్టించినా ఆయన రుణం తీర్చుకోలేనిది అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. తాజాగా ఆయన శాఖల్లో కోత విధించింది ప్రభుత్వం. వాణిజ్య పన్నుల శాఖను నారాయణ స్వామి నుంచి తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్.. ఇక, వాణిజ్య పన్నుల శాఖను ఆర్థిక మంత్రి బుగ్గనకు అప్పగించారు.. ఎక్సైజ్ శాఖకే నారాయణస్వామిని పరిమితం చేశారు. ఈ పరిణామంపై కొన్ని విమర్శలు వచ్చాయి..…
ప్రభుత్వ భూముల వేలానికి లైన్ క్లియర్ అయ్యింది.. నిధుల సమీకరణకు ప్రభుత్వ భూముల వేలానికి ఉన్న సాంకేతిక అడ్డంకిని తొలగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవోలో మార్పులు చేసింది.. 2012లో ప్రభుత్వ భూముల వేలంపై నిషేధం విధిస్తూ జారీ చేసిన జీవోకు మార్పులు చేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్… నిషేధం అంటూ నాటి జీవోలో పేర్కొన్న నిబంధనను తొలగిస్తూ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక,…
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది… ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం… బీసీ జనగణన జరపాలని అసెంబ్లీలో తీర్మానించే అంశానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.. అదాని ఎంటర్ ప్రైజెస్ కు 130 ఎకరాలను విశాఖ మధురవాడలో కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇక, 200 మెగా డేటా సెంటర్, బిజినెస్ పార్కు కోసం 130 ఎకరాల కేటాయించిన ఏపీ కేబినెట్.. ప్రకాశం జిల్లా…