ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పర్యటించబోతున్నారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఉదయం 10:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు తణుకు చేరుకుంటారు. తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత జెడ్పీ బాలుర హైస్కూల్‌లో జరిగే బహిరంగ సభకు జగన్ హాజరయ్యి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Read: భారత్ బయోటెక్ బూస్టర్ డోస్… ఇంజెక్షన్ రూపంలో కాకుండా…
అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు తణుకు నుంచి తాడేపల్లికి ప్రయాణం అవుతారు. ఈ పథకం ద్వారా సుమారు 52 లక్షల మందికి లబ్ది చేకూరనున్నది. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ లో డబ్బులు కట్టిన 8.26 లక్షల మందికి ఈరోజు రిజిస్ట్రేషన్ పత్రాలను ఇవ్వనున్నారు. ఈ పథకం ద్వారా లబ్దిదారులకు 10వేల కోట్ల రూపాయల రుణమాఫి, 6000 స్టాంపు డ్యూటీ మినహాయింపు లభిస్తుంది.