బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్య రాజ్యసభ సభలో అడుగుపెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది… ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు పంపాలని సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్లాన్‌గా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.. ఇక, ఆర్.కృష్ణయ్య ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.. ప్రస్తుతం బీసీ సంఘాల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఆర్. కృష్ణయ్య… గతంలో ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. టీడీపీ ఎమ్మెల్యేగా ప్రతినిథ్యం వహించారు.. ఇప్పుడు ఆర్. కృష్ణయ్య పేరును సీఎం జగన్ పరిశీలించడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. తన కేబినెట్‌లోనూ బీసీ మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్.. ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు పంపడం ద్వారా బీసీలకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తెలియజేయనున్నారు.
Read Also: Vegetable prices: మళ్లీ పెరిగిన టమాటా ధరలు
ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉండగా.. అందులో ఒకటి ఆర్. కృష్ణయ్యకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.. నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఆర్. కృష్ణయ్యకు కేటాయిస్తారని ప్రచారం సాగుతోన్న సమయంలో.. ఆయన తాడేపల్లికి రావడంతో ఆ వార్తకు మరింత బలం చేకూరినట్టు అయ్యింది.. ఏపీ రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ స్థానాల్లో విజయసాయిరెడ్డి, కిల్లి కృపారాణి, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్యలకు కేటాయించాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఆర్. కృష్ణయ్యతో పాటు యాదవ సామాజిక వర్గానికి చెందిన బీద మస్తాన్ రావుకి కూడా రాజ్యసభ స్థానం కేటాయించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. దీనిపై ఇవాళ సాయంత్రంలోగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.